ఆచార్య సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య మీద దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అందుకు కారణం ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా ఒక హీరోగా కీలక పాత్ర పోషిస్తుండటమే. ఆచార్య సినిమాలో రాం చరణ్ దాదాపు అరగంట కి పైగానే కనిపించబోతుండగా అందులో మెగాస్టార్ తో కలిసి చరణ్ 20 నిముషాల పాటు స్క్రీన్ మీద సందడి చేస్తాడని తెలుస్తోంది. దాంతో మెగా ఫ్యాన్స్ ఆరాటం మాటల్లో చెప్పలేకుండా ఉంది.
కాగా ఈ సినిమా మెజారిటీ భాగం కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మిగిలింది రాం చరణ్ పాల్గొనాల్సిన కొన్ని కీలక సన్నివేశాలని సమాచారం. అయితే రాం చరణ్ ఎప్పుడో ఆచార్య షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉండగా ఆర్ ఆర్ ఆర్ సినిమా లో బిజిగా ఉండటంతో ఆచార్య కి డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాడట. కాగా ఎట్టకేలకి రాం చరణ్ ఆచార్య షూటింగ్ లో జనవరి నుంచి జాయిన్ కాబోతున్నాడని లేటెస్ట్ అప్డేట్.
జనవరి నెలలో కొన్ని రోజులు అలాగే ఫిబ్రవరి నెలలో కొన్ని రోజులు ఆచార్య సినిమా కోసం రాం చరణ్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జనవరి 11 నుండి 10 రోజుల పాటు ఆచార్య షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట చరణ్. ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో ఒక 10 రోజుల పాటు మెగాస్టార్ తో చరణ్ సన్నివేశాలు తెరకేక్కించడం తో దాదాపు షూటింగ్ కంప్లీట్ అవుతుందట. మొత్తం మీద మార్చ్ నెలలో ఆచార్య సినిమా టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టేస్తారని సమాచారం.
ఇక ఈ సినిమాలో చరణ్ కి జంటగా రష్మిక మందన్న ఎంపికైందట. అదికారకమైన ప్రకటన న్యూ ఇయర్ లో రానుందని తెలుస్తోంది. అయితే మొత్తంగా రాం చరణ్ ఆచార్య సినిమాకి ఇచ్చిన డేట్స్ 20 మాత్రమే అని అంటున్నారు. మరి ఈ 20 రోజుల్లో కొరటాల శివ చరణ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేస్తాడా లేక మరికొన్ని డేట్స్ కావాల్సి వస్తాయా అన్నది ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం రాం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!