Ram : రామ్ ఇప్పుడు కోలీవుడ్ నెక్స్ట్ బాలీవుడ్..అందుకే ప్లాన్ ఇలా వేసుకున్నాడు..!

Share

Ram : ప్రతీ హీరోకి ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకోవాలనే తహతహలాడుతున్నారు. ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ స్టార్ అనే పాపులారిటీ..అసాధారణమైన క్రేజ్ తో ప్రపంచ వ్యాప్తంగా గురింపు తెచ్చుకున్నాడు. ఆయన అంత పాన్ ఇండియన్ క్రేజ్ తెచ్చుకోవాలని ఇప్పుడు ప్రతీ తెలుగు హీరో ఆరాటపడుతున్నాడు. ఆల్రెడీ తారక్, చరణ్ అదే ప్రయత్నాలలో ఉన్నారు. దాదాపు వీరికి పాన్ ఇండియన్ స్టార్ అనే క్రేజ్ వచ్చినట్టే. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో వీరు నటిస్తున్న పాత్రల తాలూకా టీజర్లు, పోస్టర్లు ఇది నిరూపించాయి.

ram-planned-for-first-kollywood-then-bollywood
ram-planned-for-first-kollywood-then-bollywood

అల్లు అర్జున్ మొన్నటి వరకు స్టైలిష్ స్టార్. ఇప్పుడు ఐకాన్ స్టార్. ఆ క్రేజ్ పుష్ప సినిమాతో రాబోతోంది. సుకుమార్ అందుకే ఈ మధ్య పుష్ప రాజ్ ఇంట్రడ్యూస్ అనే వీడియో రిలీజ్ చేసి ఐకాన్ స్టార్ క్రేజ్ ఇచ్చేశాడు. 5 సౌత్ భాషలలో పుష్ప రిలీజ్ చేసే విధంగా సుకుమార్ చిత్రీకరణ చేస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమాని రిలీజ్ చేస్తారని ఒక భాగం 2021లో ఒక భాగాన్ని 2022 లో విడుదల చేయాలని ప్లాన్ అని సమాచారం. ఈ సినిమాతో ఇటు సుకుమార్ అటు అల్లు అర్జున్ హిందీ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. అందుకే ఎక్కడా తగ్గేదే లే అనేట్టుగా పుష్ప తయారవుతుంది.

Ram : రామ్ ఆ స్థాయి కథలకి ఒకే చెప్పాలనుకుంటున్నాడు.

ఇప్పుడు వీరిని ఫాలో అవుతూ పాన్ ఇండియన్ స్టార్ అనే క్రేజ్ కోసం ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హిట్ అందుకున్న రామ్ పోతినేని ఇప్పుడు ఎక్కువగా పాన్ ఇండియన్ సినిమా ఏ డైరెక్టర్ తో చేస్తే సక్సెస్ అందుకుంటానో అని ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే ఒకేసారి ఇక్కడ తెలుగులో అక్కడ తమిళంలో క్రేజ్ అండ్ మార్కెట్ అలాగే సపరేట్ మార్కెట్ వచ్చేలా కథలను ఎంచుకొని ఓకే చెప్తున్నాడు. తమిళంలో క్రేజ్ రాగానే హిందీ పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వాలని ఇప్పటి నుంచే పక్కాగా ఆ స్థాయి కథలకి ఓకే చెప్పాలనుకుంటున్నాడు. అయితే ఆయన పాన్ ఇండియన్ స్టార్ క్రేజ్ రావాలంటే చాలానే కష్టపడాలి అంటున్నారు.


Share

Related posts

BJP : ఏపీ ప్ర‌జ‌ల ఓపిక‌ను ప‌రీక్షిస్తున్న బీజేపీ… జ‌గ‌న్ ఏం చేస్తున్నారంటే…

sridhar

Job notification : ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ..

bharani jella

టాబ్లెట్స్ వీటితో పాటు కలిపి వేసుకుంటే ప్రమాదం తప్పదు!!

Kumar