Vyuham RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తాజాగా నిర్మిస్తున్న వ్యూహం మువీపై రాజకీయ రగడ జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా దాసరి కిరణ్ నిర్మాణ సారధ్యంలో నిర్మిస్తున్న ఈ మువీ పై పలువురు టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్ నటిస్తుండగా, వైఎస్ బారతి క్యారెక్టర్ ను మానస రాధాకృష్ణన్ పోషిస్తున్నారు. వ్యూహం మువీకి సంబంధించి పలు వర్కింగ్ స్టిల్స్ ను రామ్ గోపాల్ వర్మ తన అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ వస్తున్నారు.

ఈ మువీ షూటింగ్ విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. జగన్ పాదయాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తొంది. ఇందులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల పాత్రలను తాజాగా ఆర్జీవీ పరిచయం చేశారు. వైఎస్ జగన్, భారతి, విజయమ్మ, షర్మిల పాత్రధారులు పాల్గొన్న సన్నివేశాలను షూట్ చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కొన్ని సన్నివేశాలను ఆర్జీవీ చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ .. రాష్ట్ర రాజకీయాల్లో తాను చూసిన వాస్తవ పరిస్థితులు, నమ్మిన నిజాల ఆధారంగా సినిమా తీస్తున్నానని అవే ఈ సినిమాలో ఉంటాయని చెప్పారు. ఈ సినిమా ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుందని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న వ్యూహం మువీ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, బండారు సత్యనారాయణమూర్తి లు తన వ్యూహం మువీకి మంచి పబ్లిసిటీ ఇస్తున్నారని వారికి థాంక్స్ చెబుతున్నానని అన్నారు. బండారు సత్యనారాయణ మూర్తి చేసిన ఘాటు వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన వ్యూహం మువీ భారీ పోస్టర్ ను పట్టుకుని నిల్చున్న ఓ మార్ఫింగ్ ఫోటోను ఆర్జీవీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు. తన సినిమా కు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్న టీడీపీ వారికి థ్యాంక్స్ చెబుతున్నానని, టీజర్ రిలీజ్ సమయంలో ఈ పబ్లిసిటీ ఉపయోగపడుతుందని ఆర్జీవీ అన్నారు.
Pawan Kalyan: విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో చూపిస్తా: పవన్ కళ్యాణ్
Hey @BandaruSNM 😎💃🤣 pic.twitter.com/vhKRv3xdJv
— Ram Gopal Varma (@RGVzoomin) August 13, 2023