ట్రెండింగ్ న్యూస్

లైవ్ లోనే లాస్యను ఆంటీ అనేసిన యాంకర్ రవి? షాకైన లాస్య?

Ravi and Lasya Instagram Live after 5 Years
Share

యాంకర్ లాస్య, రవి.. ఇద్దరూ కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ లో యాంకరింగ్ చేశారు. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. చాలాఏళ్ల పాటు ఇద్దరూ కలిసి బుల్లితెరను ఏలారు. కానీ.. తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఇద్దరి మధ్యా గొడవలు వచ్చేశాయి. ఇద్దరి ఫ్రెండ్ షిప్ కట్ అయిపోయింది. ఆ తర్వాత లాస్యకు పెళ్లయిపోయింది. లాస్య కూడా యాంకరింగ్ ను ఆపేసింది. తర్వాత బిగ్ బాస్ ఆఫర్ రావడం… బిగ్ బాస్ నుంచి వచ్చాక పెద్ద సెలబ్రిటీ అయిపోవడం చకాచకా జరిగిపోయాయి.

Ravi and Lasya Instagram Live after 5 Years
Ravi and Lasya Instagram Live after 5 Years

తర్వాత 5 ఏళ్లకు.. స్టార్ మాలో ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అనే సంక్రాంతి ఈవెంట్ కు ఇద్దరూ కలిశారు. యాంకర్ రవి, లాస్య.. ఇద్దరూ ఆ ఈవెంట్ లో కలవడం అనేది నిజంగా గ్రేట్. ఇద్దరూ కలిసి ఈ షోను ఎక్కడికో తీసుకెళ్లారు. ఆ ఈవెంట్ పూర్తయ్యాక.. ఇద్దరూ కలిసి ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో పాల్గొన్నారు.

ఇద్దరూ కలిసి తమ పాత అనుభవాలను పంచుకున్నారు. మొత్తానికి బిగ్ బాస్ ముచ్చట్లు, ఇద్దరూ కలిసి యాంకరింగ్ చేసిన షోల గురించి, తాజాగా చేసిన ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ ఈవెంట్ గురించి చర్చించారు. మొత్తానికి ఇద్దరూ మరోసారి కలవడం వల్ల బుల్లితెర ప్రేక్షకులు కూడా ఖుషీ అవుతున్నారు. లైవ్ లో కూడా లాస్యను యాంకర్ రవి ఆటపట్టించాడు. కాసేపు ఇద్దరూ నవ్వుకున్నారు. ఎమోషనల్ అయ్యారు. తన కూతురు లైవ్ లోకి రాగానే.. లాస్య ఆంటీతో మాట్లాడి వస్తా.. అనేసరికి లాస్యకు కోపం వచ్చింది. హేయ్.. నన్ను ఆంటీ అనకు అంటూ రవిపై కోపంగా చూసింది కానీ.. రవి ఏదో సరదాకు అలా అన్నాడు. మొత్తానికి వీళ్ల లైవ్ షో కూడా ఆధ్యంతం సరదాగా సాగింది.

మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వీళ్లిద్దరి లైవ్ షోను చూసేయండి.


Share

Related posts

Nayanthara: నయనతార మొత్తం కెరీర్ లో బాలీవుడ్ టాప్ హీరో తో ఊహించని బంపర్ ఆఫర్ …??

sekhar

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లోకి చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ? చాలా పెద్ద అమౌంట్ ఆఫర్ చేసిన మా టీవీ ?

sekhar

SSY Scheme: కుతురి పెళ్లికి రూ.71 లక్షలు పొందవచ్చు.. ఎలా అంటే..?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar