Raviteja: మాస్ మహారాజ ప్రస్తుతం సోలో హీరోగా నాలుగు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం కూడా అందుకున్నారు. దాంతో మెగా 154 మెగాస్టార్ – మాస్ మహారాజాల మల్టీస్టారర్ మూవీగా మారింది. అయితే, రవితేజ ఇప్పుడు సోలో హీరోగా నటిస్తూనే మల్టీస్టారర్ సినిమాల మీద కూడా బాగా ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది. తమిళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విష్ణు విశాల్. కానీ, అక్కడ ఉన్న స్టార్ హీరోల లిస్ట్‌లో మాత్రం ఇంకా చేరలేదనే చెప్పాలి.
ఇక తమిళంలో సూర్య, కార్తి, విజయ్, ధనుష్, అజిత్, శివ కార్తికేయన్ లాంటి హీరోల మాదిరిగా విష్ణు విశాల్ కూడా తమిళంలో చేసిన సినిమాలను తెలుగులో కూడా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇదే క్రమంలో తెలుగు హీరోలతోను రిలేషన్ పెంచుకుంటున్నాడు. తెలుగులో ఇప్పటికే రవితేజతో విష్ణు విశాల్ కి మంచి బాండింగ్ ఉంది. రీసెంట్గా విష్ణు విశాల్ చేసిన ‘ఎఫ్ ఐ ఆర్’ సినిమాకు తెలుగులో రవితేజ సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. దాంతో ఇప్పుడు విష్ణువిశాల్ నటిస్తున్న తాజా చిత్రంలో రవితేజ ఒక కీలక పాత్ర చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
Raviteja: క్రీడా నేపథ్యంలో సాగే ఈ కథ మన టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందట.
అంతేకాదు, ఈ మూవీలో విష్ణు విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర నిర్మాణంలోనే రవితేజ కూడా భాగస్వామిగా ఉండడం విశేషం. కాగా, ఈ సినిమా ‘మట్టి కుస్తీ’ పేరుతో రూపొందనుంది. క్రీడా నేపథ్యంలో సాగే ఈ కథ మన టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుం టుందట. చెల్లా అయ్యవు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు – తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా నిర్మాణంలోను అలాగే, కీలక పాత్రలోను రవితేజ నటిస్తుండటం విష్ణు విశాల్ కు బాగా కలిసొచ్చే అంశం అని చెప్పుకుంటున్నారు. ఇక రవితేజ, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో కూడా ఓ కీలక పాత్ర చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!