న్యూస్ రివ్యూలు సినిమా

రివ్యూ : ‘రెడ్’ – లైవ్ అప్డేట్స్, ఫస్ట్ హాఫ్ రిపోర్టు

Share

ఎనర్జిటిక్ హీరో రామ్…. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘రెడ్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. తమిళ బ్లాక్బస్టర్ సినిమా ‘తడాం’ రీమేక్ గా తెరకెక్కిన ‘రెడ్’ ఒక మంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఆశతో ఉన్నారు. పైగా సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు కూడా లేకపోవడం ఈ సినిమా కి కలిసొచ్చే అంశం. రెడ్ కొద్దిసేపటి క్రితమే థియేటర్లలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లైవ్ అప్డేట్స్ మీకోసం…

 

లైవ్ అప్డేట్స్ :

– సినిమా మొదటి షాట్ లో సిద్ధార్థ్ (రామ్) ఇంజనీర్ గా కనిపిస్తాడు. అతను మహిమ (మాళవిక శర్మ) తో ప్రేమలో పడతాడు

– రామ్ రెండవ క్యారెక్టర్ ఎంట్రీ. ఒక ఎనర్జిటిక్ ఐటమ్ సాంగ్ లో రామ్ వేసిన డాన్స్ స్టెప్పులు అద్దిరిపోయేలా ఉన్నాయి. ఈ పాట తోనే రఫ్ గా కనిపించే ఆదిత్య (రామ్) మరో హీరో ఎంట్రీ ఉంటుంది.

– ఆదిత్య, అతని దోస్త్ వేమ (కమెడియన్ సత్య) డబ్బులు సంపాదించేందుకు నానా పాట్లు పడుతుంటారు. మరొకవైపు సిద్ధార్థ, మహిమ లవ్ స్టోరీ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఈ లవ్ స్టోరీ చాలా రొటీన్ గా ఉంటుంది…. పెద్దగా ఎంగేజింగ్ గా అయితే ఏమీ లేదు.

– ఆదిత్య, వేమ డబ్బుల కోసం చిన్నచిన్న దోపిడీ చేస్తుంటారు, అమృత రెండవ హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. జూదానికి అలవాటుపడిన ఆదిత్య ఒకే రాత్రిలో ఎనిమిది లక్షల రూపాయలు పోగొట్టుకుంటాడు. ఒక వారం లోపల అతను ఆ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

– సినిమా మొదలయి 45 నిమిషాలు అవుతున్నప్పటికీ…. ఇంకా అసలైన కథ లోకి ఎంటర్ కాలేదు. క్యారెక్టర్ లు అన్నీ ప్రేక్షకులకు తెలిసిపోయాయి. ఈ లోపలే సిద్ధార్థ, మాళవిక మధ్య సాంగ్ మొదలవుతుంది

– ఇప్పుడే జరిగిన ఒక మర్డర్ కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కోసం లేడీ కాప్ యామిని (నివేత పేతురాజ్) ఎంటర్ అవుతుంది. తన సుపీరియర్ ఆఫీసర్ సంపత్ రాజ్ కు ఆమె ఈ కేసు డీటెయిల్స్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అసలు ఈ కేసుకు ఆదిత్య, సిద్ధార్థ లకు ఉన్నటువంటి లింక్ ఏమిటి? ఇదే ఇక్కడ సస్పెన్స్ ఫ్యాక్టర్.

– ఇంటర్వల్ బ్యాంగ్ – ఇద్దరు అనుమానితులు అయిన ఆదిత్య, సిద్ధార్థ కు హత్యకు ఉన్న సంబంధం ఏమిటి? ఇక వీరిద్దరిలో ఎవరు ఈ హత్య చేశారన్న విషయాన్ని రెండు రోజుల్లో సంపత్ రాజ్ నిర్ధారించవలసి ఉంటుంది. లేకపోతే ఇద్దరు సేఫ్ అయిపోతారు. మరి ఏం జరుగుతుంది?

రిపోర్టు : రెడ్ మొదటి భాగం సాధారణ కమర్షియల్ మూవీ గా మొదలవుతుంది. ద్విపాత్రాభినయంలో రామ్ మెప్పించాడు అనే చెప్పాలి. ఆదిత్య, సిద్ధార్థ క్యారెక్టర్ల మధ్య వేరియేషన్ దర్శకుడు బాగా చూపించాడు. లవ్ స్టోరీ రొటీన్ గా అనిపించినప్పటికీ…. ఇద్దరు హీరోయిన్ ల అందాలు ఒక వర్గం ఆడియన్స్కు కనువిందు కలిగిస్తాయి. మొత్తానికి స్టోరీ లోకి ఎంటర్ అయ్యేందుకు చాలా సమయం తీసుకున్న దర్శకుడు ఇంటర్వ్యూ మాత్రం థ్రిల్లింగ్ గా పెట్టాడు. ముగ్గురు, నలుగురు ముద్దుగుమ్మల ఎంట్రీతో ఫస్ట్ హాఫ్ కలర్ ఫుల్ గా ఉంటుంది. క్యారెక్టర్ లు అన్నీ ప్రేక్షకులకు పూర్తి గా పరిచయం అయిపోయాయి. రెండవ భాగం మొదలయ్యేందుకు స్టేజి కూడా బాగా సెట్ చేసుకున్నారు. ఎలాంటి సాగతీత లేకుండా కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సస్పెన్స్ ను ఇలాగే మరికొంతసేపు మెయింటెయిన్ చేస్తే రెడ్ సినిమా గెలుపు గుర్రం ఎక్కవచ్చు.


Share

Related posts

షాకింగ్: యువ నాయకుడి చేతికి వైకాపా అధ్యక్ష బాధ్యతలు!

CMR

Alcohol: ఆ గుడిలో ప్రసాదం గా మందు పోస్తారట.. వామ్మో

Naina

జగన్ కోసం వెయిట్ చేస్తున్న బిజెపి..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar