వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో ఏది చేసినా సెన్సేషనలే. పోర్న్ స్టార్ ని పెట్టి ‘క్లైమాక్స్’ అనే సినిమాను ఎడారిలో తీసినా… ‘నగ్నం’ అంటూ ఒక హాట్ హాట్ సినిమాని లాక్ డౌన్లో టైం లో జనాల మీదకు వదిలినా…. అన్నీ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకోవడానికే.
అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క జీవిత చరిత్రను తన సినిమాగా తీయబోతున్నానని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ ఇదివరకే అతని లాగా ఉండే హీరో ఎవరో మనకి చూపించారు.
అయితే మొదటి ఫోటోలో సినిమాల్లో పవన్ కళ్యాణ్ గెటప్ లో కనిపించిన ఆ హీరో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైట్ అండ్ వైట్ వేసుకుని దర్శనమిస్తున్న ఫోటోని గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా పవన్ అభిమానులకు చిర్రెత్తించే విషయమే అయినా వర్మ ఊపుకి అడ్డు చెప్పేది ఎవరు?
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!