ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర దుర్ఘటన.. దైవదర్శనానికి వెళ్లి వస్తూ ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి

Share

రోడ్డు ప్రమాదం: దైవదర్శనానికి వెళ్లి వస్తూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడిన సంఘటన నంద్యాల జిల్లాలో జాతీయ రహదారిపై గూబగుండం వద్ద ఆదివారం రాత్రి జరిగింది. వైయస్ఆర్ జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని మద్దిలేటి అయ్య స్వామి క్షేత్రానికి వెళ్లారు. దైవ దర్శనం అనంతరం ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణం అవగా వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం ఆళ్లగడ్డ మండలం గూబగుండం వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది.

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

 

ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు తో పాటు అతని భార్య లక్ష్మీదేవి, అక్క సామ్రాజ్యం అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ శ్రీనివాసులు, వాహనంలో ప్రయాణిస్తున్న నాగమణి, మౌనిక తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : టాప్ ఎపిసోడ్: హౌస్ లోకి శ్రీముఖి మాత్రమే కాక చాలామంది..!!

sekhar

AP Council : ఫుల్ స్పీడ్ ఫ్యాన్ : సైకిల్ పూర్తి పంచర్!

Comrade CHE

Poonam Pandey : సింగిల్ గానే ఉన్నానంటున్న పూనమ్ పాండే.. మరి భర్త ఏమైనట్టు!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar