అటు రాజకీయాలు ఇటు జబర్దస్త్ రెండింటినీ ఏకకాలంలో బ్యాలెన్స్ చేస్తున్నారు రోజా సెల్వమణి. గత కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆమె జబర్దస్త్‌ను మాత్రం వదులుకోవట్లేదు. ఇక జబర్దస్త్ షో లో కేవలం జడ్జి గానే కాకూండా తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ జబర్దస్త్ కమెడియన్లపై సెటైర్లు వేస్తూ నవ్విస్తువుంటారు. అయితే తాజాగా జబర్దస్త్ జడ్జి రోజా తనలోని కొత్త యాంగిల్‌ను బయటకు తీశారు. జబర్దస్త్ స్టేజి మీద కమెడియన్‌గా మారి హైపర్ ఆది స్కిట్లో నటించారు.
వచ్చే గురువారం ప్రసారంకాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఒకటి ఇటీవల ఈటీవీ విడుదల చేసింది. ఈ ప్రోమోలో రోజా హైపర్ ఆది స్కిట్లో కమెడియన్‌గా కనిపించి ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ స్కిట్ ను ‘రాజా’ సినిమాకి పేరడిగా చేశారు. సౌందర్య పాత్రలో రోజా నటించగా హైపర్ ఆది, పరదేశి దొంగల పాత్రలలో మరియు ఇంట్లో పిల్లలుగా గణపతి సందడి చేశారు. ఈ స్కిట్ దొంగలను బంధించి వంటింట్లో పెట్టి తాళం వేసే సీన్ నుంచి రోజా సింగర్‌గా పేరుతెచ్చుకోవడం వరకు సాగనున్నది.
అయితే, ఈ సత్కార కార్యక్రమం చాలా ఫన్నీగా ఉండనున్నట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తుంది. సింగర్ అయ్యాక ఆమె స్టేజి మీద మాట్లాడుతూ ‘నేను ఈ స్థాయికి రావడానికి కారణం..” అని అనగానే వెంటనే హైపర్ ఆది మురిసిపోతుంటాడు. రోజా తన గురించే చెబుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తాడు. కానీ రోజా మాత్రం తాను ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం.. ఆ సెంటర్ కమెరావాళ్లు అని అనడంతో తీవ్రంగా నిరాశపరించిందని ఆది వెరైటీ ఎక్స్ప్రెషన్ పెట్టాడు. ప్రోమో బట్టి చూస్తే ఈ స్కిట్లో ఇలాంటి పంచ్‌లు ఇంకా చాలానే ఉన్నట్లు తెలుస్తుంది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!