న్యూస్

Painting: ఓ వృద్ధురాలి వంట గదిలో దొరికిన కళాఖండం విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Share

Painting: ప్రాన్స్ లో ఓ వృద్ధురాలి ఇంటిలో గోడకు వేలాడుతూ కనిపించిన ఒక పురాతన కళాఖండం విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. 13వ శతాబ్దంలో క్రైస్ట్ మాక్డ్ పేరుతో ఇటలీలోని ఫ్లోరెన్స్ కు చెందిన కళాకారుడు చీమాబూయ్ వరుస పెయింటింగ్ లను చిత్రీకరించారు. ప్రాన్స్ నగరం కాంపియేన్ లో తాజాగా బయటపడిన కళాఖండం వీటిలో ఒకటి. ప్రాన్స్ లోని ఓ వృద్ధురాలి వంట గదిలో వేలాడదీసిన ఈ పురాతన కళాఖండాన్ని అక్టోబర్ 27వ తేదీన వేలం వేయనున్నారు.   ఈ వేలంలో ఇది రూ.46.39 కోట్లు (సుమారు అరు మిలియన్ యూరోలు) పలుకుతుందని అంచనా.

Rs.46 crores painting in kitchen
Rs.46 crores painting in kitchen

ఈ కళాఖండం మూలాలను ధృవీకరించడంలో ఎలాంటి వివాదమూ లేదని నిపుణులు తెలిపారు. ఈ కళాఖండాన్ని ఇన్ ఫ్రారెడ్ కాంతితో పరీక్షలు నిర్వహించారు. చీమాబూయ్ గీసిన ఇతర కళాఖండాలతో దీన్ని పోల్చి చూశారు. చీమాబుయ్‌నే చెనీ డీ పెపో అని కూడా పిలుస్తారు. వీటన్నింటినీ గీసిన చేయి ఒక్కటే అని కళాఖండాల నిపుణుడు ఎరిక్ టర్నిన్ చెప్పినట్లు ప్రాన్స్ పత్రిక లె ఫిగారో తెలిపింది.

క్రీస్తు జెరూసలేంలో అడుగుపెట్టినప్పటి నుండి శిలువ వేసే వరకూ మధ్య జరిగిన పరిణామాలను వివరించే పెయింటింగ్ ల సిరీస్ లో ఇదీ ఒకటి అని నిపుణులు భావిస్తున్నారు. దీన్ని 1280లో చిత్రీకరించినట్లు అంచనా. చిమాబూయ్ పెయింటింగ్ సిరీస్ లో దీనికి సంబంధించిన మరో రెండు పెయింటింగ్ ను లండన్ నేషనల్ గ్యాలరీ, న్యూయార్క్ లోని ఫ్రిక్ కలెక్షన్ లలో చూడొచ్చని అని చెబుతున్నారు.


Share

Related posts

Anchor Syamala : ఫ్యామిలీతో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న యాంకర్ శ్యామల

Varun G

Roja: ఎమ్మెల్యే రోజా ని ఇబ్బంది పెడుతున్న ఆ ఆఫీసర్..??

sekhar

ఏపి, తెలంగాణతో సహా పది రాష్ట్రాల హైకోర్టు సీజేల బదిలీ

somaraju sharma