KCR: మంచి చేసిన‌ కేసీఆర్… మండిప‌డుతున్న 60000 ఉద్యోగులు!

Share

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు కొంద‌రిలో సంతోషాన్ని నింపుతుండ‌గా మ‌రికొంద‌రిలో ఆందోళ‌న‌కు కార‌ణంగా మారుతోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యం మంచిదే అయినా అమ‌లులో ఉన్న స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆయ‌న‌కే బౌన్స్ అవుతుందంటున్నారు. ఇటీవల పీఆర్సీ అమలుపై తెలంగాణ రాష్ట్ర సర్కార్​ ఇచ్చిన ఉత్తర్వుల్లో పబ్లిక్ అండర్​ టేకింగ్స్, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాల పెంపుపై మెలిక పెట్టింది. హెడ్​ఆఫ్ ది డిపార్ట్​మెంట్ ​అనుమతితో ఫైనాన్స్​డిపార్ట్ మెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలని పేర్కొంది.

Read More: KCR: ఉద్యోగాల భ‌ర్తీః మోడీ, కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఇదే

ఇది స‌మస్య‌

తెలంగాణ‌ రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్లు, పబ్లిక్ ​సెక్టార్ అండర్​ టేకింగ్స్, కో ఆపరేటివ్​ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై గందరగోళం నెలకొంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన పీఆర్సీ ఉత్తర్వుల్లో అంతకుముందు ఫిట్​మెంట్​ఎలా అమలు చేస్తున్నారో అలాగే చేసుకోవాలని పేర్కొన్నారు. దీంతో 2015లో రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, కో ఆపరేటివ్​ సొసైటీలు వారి బోర్డుల్లో ఎజెండాగా పెట్టుకుని నేరుగా అప్రూవ్ చేసుకున్నారు. కానీ ఈసారి అలా ఇవ్వలేదు. ప్రతి కార్పొరేషన్​ నుంచి వారు హెచ్ వోడీ నుంచి పీఆర్సీపై ఒక ప్రపోజల్​ను ఫైనాన్స్ ​డిపార్ట్​మెంట్​కు పంపాల్సి ఉంటుంది. అక్కడి నుంచి స్పెషల్ మెమో కానీ జీవో తెచ్చుకోవాలని పేర్కొన్నారు. అయితే ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ పర్మిషన్ మాత్రం ఇవ్వడం లేదు.

Read More:KCR: కేసీఆర్‌పై ష‌ర్మిల రాజ‌కీయం మామూలుగా లేదుగా….


వీళ్ల‌కు గుడ్ న్యూస్ … వాళ్ల‌కు బ్యాడ్ న్యూస్‌…
లాభాల్లో ఉన్న మూడు కార్పొరేషన్లు.. మినరల్​ డెవలప్​మెంట్, టూరిజం, బేవరేజేస్ కార్పొరేషన్లకు మాత్రమే ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అనుమతినిచ్చింది. దీంతో మిగిలిన 61 కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. పీఆర్సీ ప్రకారం జీతాల పెంపుపై ప్రపోజల్స్ పంపినా, కొన్ని కార్పొరేషన్ల నుంచి ఫైల్స్ వెళ్లినా ఇంతవరకు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ అప్రూవల్ ఇవ్వలేదు. మొత్తం 60 వేల మంది రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఎంప్లాయ్స్​ ఆయా కార్పొరేషన్లలో పని చేస్తున్నారు. వీరంతా తమకు పీఆర్సీ ప్రకారం జీతం వస్తుందా? లేదా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Share

Related posts

కుప్పకూలిన ఆనకట్ట : 9మంది మృతి

somaraju sharma

Belly belt: ప్రసవం తర్వాత బెల్లి బెల్ట్ వాడవచ్చా?లేదా?తెలుసుకోండి!!

Kumar

బ్రేకింగ్ : గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ.. ఏం జరగబోతోంది….

arun kanna