అజిత్ కి థాంక్స్ చెప్పిన ఆర్ఎక్స్ 100 హీరో..!!

“ఆర్ఎక్స్ 100” అనే ఫస్ట్ సినిమాతోనే అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరో కార్తికేయ. హీరోకి తగ్గ పర్ఫెక్ట్ బాడీ ఫిట్నెస్ తో ఫస్ట్ లుక్ లోనే తెలుగు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న కార్తికేయ ప్రస్తుతం “చావు కబురు చల్లగా” అనే సినిమా చేస్తున్నారు.

Karthikeya Nagitive Role In Ajith Movie Tollywood Kollywood South Cinema Geeta Arts 2 - Telugu Tol-TeluguStopఈ సినిమాతో పాటు “గుణ 369” అనే సినిమా కూడా కార్తికేయ లైన్ లో పెట్టడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీలో చాలా మంది సినీ ప్రముఖులు కార్తికేయకు విషెస్ తెలియజేశారు. అయితే ఎక్కువగా తమిళ ఇండస్ట్రీ అజిత్ ఫ్యాన్స్ కార్తికేయకు భారీ స్థాయిలో విషెస్ తెలియజేయడం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఈ వార్త సంచలనంగా మారింది.

 

ఇటువంటి తరుణంలో తమిళ్ సూపర్ స్టార్ అజిత్ కి ట్విట్టర్ లో కార్తికేయ థాంక్స్ చెప్పారు. అంతేకాకుండా ఆయన అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కూడా కృతజ్ఞతలు అని…. ట్విట్టర్లో బదులిచ్చారు. అయితే కార్తికేయ త్వరలో అజిత్ నటించబోయే సినిమాలో విలన్ రోల్ లో నటించనున్నట్లు సమాచారం.