Samantha: టాలీవుడ్ మెరుపు తార సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అవును.. తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మొదటి సినిమా అయినటువంటి ‘ఏ మాయ చేసావే’తో తెలుగు యువత గుండెల్ని కొల్లగొట్టింది. అక్కడితో ఆగకుండా ఆ సినిమాలో నటించినటువంటి అక్కినేని వారసుడు నాగ చైతన్యను కూడా ప్రేమలో పడేసింది. ఇంకేముంది కట్ చేస్తే ప్రేమ.. పెళ్లి.. కొన్ని నెలల వ్యవధిలోనే జరిగిపోయాయి. అంతా బాగానేవుంది అనుకొనేలోపే ఏం జరిగిందో తెలీదు కానీ, వారు విడాకులతో అభిమానులకు షాక్ ఇచ్చారు.
Mahesh – Trivikram: మహేష్ బాబు – త్రివిక్రమ్ హ్యాట్రిక్ సినిమా మీద ఇప్పటి నుంచే అనుమానాలు..అవి నిజమవుతాయా..?
Samantha: సామ్ – చై – విడాకుల మధ్య వ్యవహారం ఇదేనా?
సామ్ – చై విడాకుల వ్యవహారం ముగిసి నెలలు గడుస్తున్నా సోషల్ మీడియాలు మాత్రం వారిని ఇప్పట్లో వదిలేటట్టు కనబడటం లేదు. అవును.. విడాకుల తరువాత ముఖ్యంగా సమంతను వీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇకపోతే విడాకుల తరువాత సామ్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారారు. వివిధ రకాల పోస్టులను పెడుతూ ఆ విషయాన్ని పరోక్షంగా జనాలకి గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వారి ఎడబాటుకు గల కారణం ఏమిటని కొంతమంది ఆరా తీస్తున్నారు.
Raai Lakshmi: చలికాలంలోనూ చెమటలు పట్టిస్తున్న లక్ష్మీ రాయ్..ఇక కుర్రాళ్ళను ఆపడం కష్టమే!
6 నెలల వ్యవధి కధ ఇదే…
సోషల్ మీడియాలో సమంత తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. తన వ్యక్తిగత అకౌంట్ ఇన్స్టా వేదికగా సామ్ ఇలా రాసుకొచ్చారు… “రానున్న 6 నెలల తరువాత నేనేమిటో ఈ ప్రపంచం చూస్తుంది.!” అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక అది చుసిన జనాలు ‘సామ్ అంటే ఏమిటో ఇప్పటికే చూసేసాం కదా.!’ ఇంకా ఏముంది చూడటానికి అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇకపోతే సామ్ సినిమాల జోరుని పెంచేసింది. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ మంచి బిజీగా వుంది.