న్యూస్

Samantha : సమంత కి బిగ్ బ్యాడ్ న్యూస్ చెప్పిన కృతి శెట్టి .. అమ్మో చిన్న పిల్ల అనుకుంటాం కానీ మామూలుది కాదు !

SAMANTHA
Share

Samantha : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే మాములు విషయం కాదు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది. హీరోయిన్స్ వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. కానీ అతి తక్కువ మంది మాత్రమే ఎక్కువకాలం హీరోయిన్ గా కొనసాగుతూ టాప్ హీరోయిన్ స్థాయిలో ఉంటారు. అలాంటి వాళ్ళని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు వారెవ్వా అనుకునే ఇండస్ట్రీ మనది.ఎందుకంటే కొత్త హీరోయిన్ చేసిన మొదటి సినిమా హిట్ అయితే వచ్చే క్రెజ్ వేరు కదా. మరి అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు వరుస విజయం సాధిస్తే అది హ్యాట్రిక్ అనే చెప్పాలి కదా.అలాంటి అదృష్టం అందరిని వరించదు. ఎక్కడో సుడి ఉంటేనే గాని వరుసగా మూడు సినిమాలు విజయాన్ని సాధించలేవు..

Samantha : మొదటి మూడు సినిమాలు హిట్ అయిన మొదటి హీరోయిన్ ఎవరంటే..?

samantha

అలాంటి హీరోయిన్స్ మన సినీ ఇండస్ట్రీలో ముగ్గురు ఉన్నారు.వాళ్ళు చేసిన మొదటి మూడు సినిమాలు విజయం అందుకోవడం అనేది మాములు విషయం కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయలతో దూసుకుపోతున్న సమంత ఆ రికార్డ్ ను కైవసం చేసుకుంది. మొదటి మూడు సినిమాలు కూడా హిట్ అవ్వడంతో ఆమెకు అదృష్టం పెట్టిందనే చెప్పాలి. ఏమాయె చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి అందరిని తన వైపు తిప్పుకుంది.ఏ మాయ చేసావేతో వచ్చిన సమంత.. ఆ తర్వాత బృందావనం సినిమాతో మరో హిట్ అందుకుంది.ఇక మూడో సినిమాగా వచ్చిన మహేష్ బాబు దూకుడు బ్లాక్‌బస్టర్ అయింది.

Samantha : అనుపమ పరమేశ్వరన్ పొజిషన్ ఏంతంటే..?

SAMANTHA

సమంత తరువాత ఆ హ్యాట్రిక్ సాధించిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ శెట్టి. 2016లో త్రివిక్రమ్ తెరకెక్కించిన అ.. ఆ సినిమాతో సెకండ్ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయి విజయం సాధించింది.ఆ తరువాత అనుపమ నటించిన ప్రేమమ్ కూడా మంచి విజయం అందుకుంది.ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడిగా నటించింది అనుపమ పరమేశ్వరన్. వీటి తర్వాత విడుదలైన మూడో సినిమా శతమానం భవతి. శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 2017 వ సంవత్సరంలో సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన శతమానం భవతి 35 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.

చిన్న పిల్ల అనుకుంటాం కానీ మామూలుది కాదు…

SAMANTHA

ఇప్పుడు సమంత, అనుపమ. పరమేశ్వరన్ ల రికార్డ్ ను చేరుకున్న మరొక నటి కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే హ్యాట్రిక్ హిట్ కొట్టింది. ఆ తరువాత నటించి aఈమె నటించిన మొదటి మూడు సినిమాలు విజయం అందుకున్నాయి.ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మంచి విజయమే అందుకుంది. ఇప్పుడు సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు సినిమా కూడా మంచి కలెక్షన్స్ తో ముందుకు అడుగులేస్తుంది. మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ అందుకుంది. షేర్ కూడా 26 కోట్ల వరకు ఉంది.నాగ చైతన్యకు జోడీగా ఇందులో ఓ అల్లరి పాత్రలో నటించింది అందరిని మెప్పిస్తుంది కృతి శెట్టి..చిన్న పిల్ల అనుకుంటాము. కానీ. కృత్తిశెట్టి మామూలుది కాదు అనడానికి ఆమె సాధించిన విజయలే ఉదాహరణ. మొదటి మూడు సినిమాలు హిట్ అవ్వడం అంటే ఇండస్ట్రీలో పెద్ద విజయం సాధించినట్లే. అయితే మొదటి మూడు సినిమాలు హిట్ అయిన హీరోయిన్స్ నటించిన ఒక సినిమాలో హీరోగా నాగ చైతన్య ఉండడం గమనార్హం… సమంతకి ఏమాయె చేసావో, అనుపమకి ప్రేమమ్, ఇప్పుడు మన కృతిశెట్టికి బంగారాజు.


Share

Related posts

Pain Killer: నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం కోసం ఇవి ట్రై చేశారా..!?

bharani jella

ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య

somaraju sharma

Sugar: తీపి పదార్థాలు తినాలనిపిస్తుందా..!? చెక్కర కు బదులు ఇవి వాడండి..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar