Pushpa: సమంత కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలవబోతోంది పుష్ప సినిమాలో స్పెషల్ నంబర్. మొదటి సినిమా ఏ మాయ చేశావే సినిమా నుంచి గత చిత్రం జాను వరకు ఏ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది లేదు. కాజల్, అనుష్క, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ అందరూ ఐటెం సాంగ్స్ చేశారు. అందుకే చాలా సందర్భాలలో సమంత ఐటెం సాంగ్ చేస్తుందో అని అనుకున్నారు. కానీ ఆమె హీరోయిన్గా మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చింది. ఎట్టకేలకి ఇప్పుడు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది. వాస్తవంగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌ను అనుకున్నారు.
కానీ అనూహ్యంగా సమంతను ఫైనల్ చేసి సర్ప్రైజ్ చేశారు. ఇక ఈ సాంగ్ రాక్స్టాక్ దేవీశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన అన్నీ ఐటెం సాంగ్స్‌ను మించి ఉంటుందట. ఐటెం సాంగ్స్‌కు డీఎస్పీ పెట్టింది పేరు. ఇక సుకుమార్ సినిమాలో ఉండే సాంగ్ పిక్చరైజేషన్ ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ అనే సాంగ్ నిలవబోతోంది. ఇక ఇటీవల సమంత బ్యాక్ ఫోజ్ రిలీజ్ చేసిన సుకుమార్ బృందం తాజాగా సమంత లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సమంత ఎంత హాట్‌గా కనిపించబోతుందో ఈ తాజా పిక్ జస్ట్ శాంపిల్.
Pushpa: ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అవుతుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ సాహిత్యం అందించగా ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో పాటు మరికొందరు కొరియోగ్రాఫర్స్ మాస్ స్టెప్స్ కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ లిరికల్ వీడియోను ఈనెల 10న రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన సమంత లుక్‌ను వదిలారు. ఈ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అవుతుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ఈ డిసెంబర్ 17న 5 భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!