సర్కారు వారి పాట ప్రీ బిజినెస్ డిటేయిల్స్.. మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకోవచ్చు..!

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు తో పూరి జగన్నాధ్ ఏమంటూ బిజినెస్ మాన్ అన్న సినిమా చేశాడో అప్పటి నుంచి నిజంగానే రీల్ లైఫ్ లో, రియల్ లైఫ్ లో మహేష్ పెద్ద బిజినెస్ మాన్ అయిపోయాడు. అందుకే మహేష్ సొంత బ్యానర్ తో బిజినెస్ మాన్ మారి అద్భుతమైన సినిమాలు నిర్మిస్తున్నాడు. మహేష్ నటించే ప్రతి సినిమాకి మహేష్ పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల నిర్మాతకు ఆర్థిక భారం పడకుండా.. సపోర్ట్ చేస్తున్నాడు. అంతేకాదు బిజినె మాన్ గాను సక్సస్ అవుతున్నాడు.

Sarkaru Vaari Paata' Motion Poster: Stylish, theme-oriented - Tamil News - IndiaGlitz.com

భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ తీసుకునే కంటే లాభాలలో వాటా అన్న కాన్సెప్ట్ తో సినిమాలు కమిటవుతున్నాడు. ఇంతకుముందు మహేష్ బాబు సినిమాలకు ఇదే జరిగింది. ఇక 2020 సంక్రాంతి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా ముందస్తు ఒప్పందాల రూపంలో భారీగానే అందుకున్నారని టాక్ వినిపించింది. ఆ సినిమా చాలా ముందే బిజినెస్ పూర్తి చేసుకోవడంతో కోట్లలో లాభాలు గడించారని చెప్పుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సర్కార్ వారి పాట కూడా అంటున్నారు.

‘ సర్కారు వారి పాట’ షూటింగ్ ఈ ఏడాది నవంబర్ నుంచి అమెరికాలో ప్రారంభం కానుందని సమాచారం. 50రోజుల పాటు సాగుతుందని తెలుస్తుంది. ఇక్కడ కూడా ఒక బ్యాక్ సెట్ నిర్మించారని ఆ సెట్ లో కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు డిజిటల్ రైట్స్ సహా శాటిలైట్ హక్కులను విక్రయించారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇందుకోసం 35 కోట్లు చెల్లించేందుకు ప్రముఖ సంస్థ సిద్ధమైందట.

ఇంకా కొంత బిజినెస్ మిగిలే ఉందని అంటున్నారు. మొత్తానికి సర్కారు వారి పాట సెట్స్ మీదకి వెళ్ళకముందే బిజినెస్ లో రికార్డ్ సృష్ఠిస్తోంది. ఇది తెలిసి మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారట.


Share

Related posts

Ghani : ‘గని’ అప్‌డేట్‌తో సర్‌ప్రైజ్ చేసిన వరుణ్ తేజ్..సోలోగా దీపావళికి

GRK

Egg: కోడి గుడ్లు కోడి నుండి వ‌స్తాయి కాబట్టి అవి ఖచ్చింతంగా నాన్ వెజ్ అనే అంటారా ? అయితే ఇది తెలుసుకోండి!!

Kumar

వైసిపిలో చేరిన చలమలశెట్టి

somaraju sharma