NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సింహాచలం దేవస్థానంలో ఏం జరుగుతుంది..?

scam and politics around simhachalam devasthanam

ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన అంశాల్లో సింహాచలం దేవస్థానం వివాదం ఒకటి. దేవస్థానంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రోజు రోజుకీ కొత్త మలుపు తీసుకుంటున్నాయి. అక్రమార్కుల అక్రమాల చిట్టా కూడా పెరుగుతోంది. అయితే.. దీనికి రాజకీయం కూడా తోడైంది. మన్సాస్ ట్రస్ట్ తోపాటు సింహాచలం దేవస్థానం పాలకమండలి చైర్ పర్సన్ గా ఉన్న సంచయిత గజపతి వర్సెస్ టీడీపీగా మారింది. సంచయిత వచ్చాకే అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తూండగా.. గత ప్రభుత్వ హయాంలో దేవాలయ ఆస్తులు, ఆదాయంపై ఆడిట్ నిర్వహించపోవడం వల్లే అవినీతి జరిగిందని టీడీపీ నాయకులు అందుకే వణుకుతున్నారని ఆమె అంటున్నారు.

scam and politics around simhachalam devasthanam
scam and politics around simhachalam devasthanam

అయిదేళ్ల నుంచీ అక్రమాలు జరిగాయా..

దేవస్థానంలో జరిగిన అక్రమాల్లో హైమావతి అనే మహిళ ప్రధాన సుత్రధారిగా అనుమానిస్తున్నారు. విచారణాధికారిగా ఉన్న దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్ ఆజాద్ తన విచారణలో పలు అక్రమాలు గుర్తించినట్టు సమాచారం. దేవస్థానంలో హైమావతి తమ్ముళ్లు, మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ స్కామ్ లో ప్రధాన నిందితులుగా అనుమానిస్తున్నారు. దేవస్థానంకు వచ్చే ఆదాయాన్ని పక్కదారి పట్టించడంలో వీరు కీలకపాత్ర పోషించారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రాబ్యాంక్ తరపున ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిగా ఎడ్ల శ్రీను బ్యాంకు ఖాతాలో ఆరు లక్షల రూపాయాలు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఒక చిరుద్యోగి ఖాతాలో ఇంత లావాదేవీలు ఎలా జరిగాయి.. ఎవరెవరికి నగదు వెళ్లిందనేదానిపై విచారణ జరుగుతోంది.

ఔట్ సోర్సింగ్ చిరుద్యోగి మాములోడు కాదు..

గతంలో కూడా శ్రీనుపై ఆరోపణలు ఉన్నట్టు గుర్తించారు. విలాసవంతమైన జీవితం, ట్రావెల్స్ వ్యాపారం.. ఇవన్నీ దేవస్థానంకు చెందాల్సిన నగదుతోనే చేసాడని అంటున్నారు. విరాళంగా వచ్చిన మొత్తంలో 90శాతం ఇతను చాకచక్యంగా పక్కకు తీసేవాడని దేవస్థానానికి 10శాతం లెక్కలు చూపేవాడు. ఇలా దేవస్థానంను, బ్యాంకును కూడా మోసం చేశాడు. ఇందులో ఇంకెవరి పాత్ర ఉంది.. ఎంతమందికి డబ్బు ముట్టిందనేదానిపై లెక్కలు తీస్తున్నారు అధికారులు. కొన్నేళ్ల నుంచీ జరుగుతున్న ఈ అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి విచారణలో మరెంత అవినీతి వెలుగులోకి వస్తుందో చూడాలి.

 

author avatar
Muraliak

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju