బుల్లితెరపై చాలా కామెడీ షో లు నిదానంగా పుట్టుకొస్తున్నాయి. గత ఎనిమిదేళ్లుగా టెలివిజన్ రంగంలో తిరుగులేని అధిపత్యం ప్రదర్శించిన ‘జబర్దస్త్’ కి పోటీగా మెగా బ్రదర్ నాగబాబు సారథ్యంలో వచ్చిన ‘అదిరింది’ సూపర్ సక్సెస్ అయింది అని చెప్పాలి. ఈ కారణంగానే ఎపిసోడ్ ల పైన ఎపిసోడ్ లకు యూట్యూబ్ లో రెకార్డు, వ్యూస్, లైక్ లు సాధిస్తున్నాయి.
ఇక ఈ షో మొదలైనప్పుడు మొదట సమీరా అనే ఒక యాంకర్ ను తీసుకున్నారు. అయితే ఆమె కొన్ని అనూహ్య పరిస్థితుల మధ్య షో వదిలి వెళ్లి పోవాల్సి వచ్చింది. తాజాగా ఈ హాట్ యాంకర్ ఈ షో గుట్తు విప్పింది. మొదట్లో కొంత మంది టీం లీడర్లను పెట్టిన షో నిర్వాహకులు ఆ తర్వాత చాలా మార్పులు చేశారు. అదిరింది పేరుని బొమ్మ అదిరింది పేరిట మరో సీజన్ గా మార్చారు. దీనితో జడ్జి లు కూడా మారిపోయారు.
టీవీ సీరియల్ హీరోయిన్ సమీరా షరీఫ్ అదిరింది యాంకర్ గా పది ఎపిసోడ్లే బాధ్యతలు నిర్వర్తించింది. అయితే ఆమె వెంటనే వెళ్లి పోవడం పెద్ద దుమారాన్నే లేపింది. దీనిపై అనేక ఊహాగానాలు ప్రచారం అయ్యాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఆ షో నుండి నన్ను ఎందుకు తీసేసారో ఇప్పటికి కూడా తెలియదు అసలు ఆ షో క్లిక్ కాలేదు…. అందుకే మార్పులు చేయాలని భావించి అందులో భాగంగా నన్ను తీసేసారా ఏమో అని అనుకుంటున్నాను అని అనింది. కానీ ఇప్పటికి కూడా ఆ షో కి పెద్దగా స్పందన లేదు అని సమీరా చెప్పడం గమనార్హం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!