గవర్నమెంట్ ఉద్యోగం పొందటమంటే ఆషా మాసీ విషయం కాదు. దానికోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. తిండి తిప్పలు లేకుండా చదివితే గాని గవర్నమెంట్ జాబ్ సొంతం చేసుకోలేరు. వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక వారి ఆనందానికి అవదులుండవు. కాని ఆ జాబ్ ను చూసుకునే అందరినీ తక్కువ చేసే తత్వం చాలా మందికీ ఉంటుంది. ఆ జాబ్ ను చూసుకుని ఆఫ్ ట్రాల్ నువ్వెంత.. నేనెవరో తెలుసా.. అని విర్రవీగుతూ ఎవ్వరినీ లెక్కచేయకుండా ప్రవర్తిస్తుంటారు చాలా మంది ఆఫీసర్లు..
అందులోనూ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పోలీస్ వ్యవస్థలోని వ్యక్తుల గురించి.
పోలీస్ అనే పొగరు వారి నరనరాల్లో ప్రవహించడం వల్లేమో కొందరు ఆఫీసర్లు మేం ఏం చేసినా అడిగేటోడెవ్వరూ.. మాకడ్డెవరూ అంటూ అడ్డొచ్చిన వారిపై విరుచుకుపడుతుంటారు. కొందరి పోలీసులపై వచ్చిన ఆరోపణలే ఇందుకు సాక్ష్యం. చాలా విషయాల్లో మాకు పొగరంటూ కొందరూ ఆఫీసర్లు నిరూపించుకున్నారు. తాజాగా కూడా ఒక ఘటన ఇలాగే జరిగింది. నాకే ఎదురు మాట్లాడతావా అనే పోలీస్ ఆఫీసర్ పని పట్టారు ఎయిర్ లైన్ సిబ్బంది. మరి ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు? దానికి ఆ ఎయిర్ లైన్ సిబ్బంది ఎలా జవాబు చెప్పారో ఈ ఆర్టికల్ చదివేసి తెలుసుకోండి..
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ కు చెందిన పోలీసు అధికారి ఢిల్లీ వెళ్లేందుకు తనతో పాటుగా ఇంకో ఇద్దరికి కలిసి స్పైస్ జెట్ ఎస్ జీ 8194 ఫ్లైట్ కు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే ఆ ఎస్సై తన తోటి వ్యక్తులతో కలిసి మంగళవారం(నవంబర్ 17)న అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. కాని అతడు అనుకున్న సమయానికి ఎయిర్ పోర్టుకు చేరుకోలేక పోయాడు. దాంతో ఎయిర్ పోర్టు సిబ్బంది ఆ పోలీస్ ఆఫీసర్, మిగతావారికి బోర్డింగ్ పర్మీషన్ ఇవ్వలేదు. దాంతో రెచ్చపోయిన పోలీస్ ఆఫీసర్ స్పైస్ జెట్ స్టాఫ్ తో గొడవపడ్డారు. దాంతో పోలీస్ పోలీస్ అధికారి మరింత రెచ్చిపోయి ఓ ఉద్యోగిపై చేయి చేసుకున్నాడు.
ఇంకేముంది దానితో అధికారి, మిగతా ఇద్దరి మధ్య సిబ్బందికి గొడవలు పెరిగాయి. దాంతో వారి గొడవను నియంత్రించేందుకు విమానాశ్రయ సెక్యూరిటీ టీమ్, సీఐఎస్ఎఫ్ స్టాఫ్ కదరంగంలోకి దిగారు. ఇంకేముంది అధికార గర్వంతో విర్రవీగిన ఆ పోలీస్ అధికారిని కటకటలాకు పంపారు. కాని ఆ తర్వాత వారి మధ్యన రాజీ కుదరడంతో కంప్లైంట్ వెన్నక్కి తీసుకున్నట్టు సమాచారం. కాగా సిబ్బందిపై చేయి చేసుకున్న పోలీసు అధికారిని మాత్రం విమానంలో వెళ్లేందుకు పర్మిషన్ మాత్రం ఇవ్వలేదు. అధికారితో వచ్చిన ఇద్దరి వ్యక్తులకు పర్మీషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికారం చేతిలో ఉందని రెచ్చిపోతే ఇలాగే జరుగుతుందని కొందరూ భావిస్తున్నారు.