Gurthunda-seethakalam: ఆగిపోయిందనుకున్న సినిమా నుంచి సాలీడ్ అప్‌డేట్..

Share

Gurthunda-seethakalam: మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు దాటిపోయింది. శ్రీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన తమన్నా ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్‌లో యంగ్ హీరోల దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు మిగతా మెగా హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. తెలుగులో మాత్రమే కాకుండా కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనూ సూర్య, కార్తి లాంటి స్టార్స్ సరసన నటించింది తమన్నా.

solid update from gurthunda-seethakalam-
solid update from gurthunda-seethakalam-

ఇన్నేళ్ళలో తమన్నా కెరీర్ గ్రాఫ్ దారుణంగా ఎప్పుడూ తగ్గింది లేదు. అలాగే ఆమె క్రేజ్ కూడా చాలా వరకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గింది లేదు. అలాంటి స్టార్ హీరోయిన్ సత్యదేవ్ లాంటి హీరో సరసన సినిమా చేస్తుందని ఏ ఒక్కరైనా ఊహిస్తారా..! కానీ తమన్నా చాలా ప్రొఫెషనల్. సినిమాను ఎంతగా ప్రేమిస్తుందో ఆమె కమిటయినవి చూస్తేనే అర్థమవుతుంది. సత్యదేవ్ టాలెంటెడ్ హీరో. కథ నచ్చింది. ఇంతకంటే ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి ఏం కావాలి. అందుకే తమన్నా సత్యదేవ్ హీరోగా రూపొందుతున్న గుర్తుందా శీతాకాలం సినిమలో హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Gurthunda-seethakalam: ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా వెల్లడించారు.

అయితే, ఈ సినిమా గురించి గత కొంతకాలంగా ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. దాదాపు అందరూ అదే అనుకున్నారు. కానీ, తాజాగా చిత్రబృందం సాలీడ్ అప్‌డేట్ ఇచ్చి ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. నాగశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్ కూడా వదిలారు. ఇక త్వరలో డేట్ కూడా లాక్ చేసి ప్రకటించనున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీస్ మేఘా ఆకాష్, కావ్య శెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన లవ్ మాక్ టైల్ సినిమా ఆధారంగా తెలుగులో గుర్తుందా శీతా కాలం సినిమా రూపొందుతోంది.


Share

Related posts

Priya Mani Beautiful Looks

Gallery Desk

Balakrishna : బాలకృష్ణ సినిమాని రిజెక్ట్ చేసిన శృతి హాసన్..?

GRK

సినిమా హాళ్ళు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి బిగ్ గుడ్ న్యూస్ !

sridhar