ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sonu sood: సోనూ సూద్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్ల హృదయాలను కలిచివేసింది..! ఆ మేటర్ ఏమిటంటే..?

Share

Sonu sood: దేశంలో కరోనా వేళ తన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సోనూ సూద్ రియల్ హీరోగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. కష్టాల్లో ఉన్న అనేక మందికి సాయం చేసి అపర దాన కర్ణుడుగా మారారు. దీంతో దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఆయనను అభిమానిస్తున్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను అధికారులు ఆయన సాయంతో నేరవేరుస్తున్న పరిస్థితి. మీడియాలో, సోషల్ మీడియాలో సోనూ సూద్ కు సంబంధించి ప్రతి వార్త ప్రాధాన్యత సంతరించుకుంటోంది. కాగా ఈ రోజు సోనూ సూద్ తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఎమోషనల్ పోస్టు చేశారు.

Sonu sood emotional tweet
Sonu sood emotional tweet

“పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా, నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విష్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు నాకు నేర్పించిన జీవిత పాఠాలకు ధన్యవాదాలు. నేను నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో ఎప్పుడూ వ్యక్తపరచలేవు. మీరు లేకుండా నా జీవితంలో ఎర్పడిన శూన్యం నేను మిమ్మల్ని మళ్లీ చూసే వరకు ఎప్పుడూ అలాగే ఉంటుంది” అంటూ పోస్టు చేశారు. సోనూ ఈ పోస్టుతో పాటు తన తల్లికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశారు.

సోనూ సూద్ తల్లి సరోజ్ సూద్ 2007 లో మరణించారు. ఆయన తండ్రి శక్తి సూద్ 2016లో పరమపదించారు. తాజాగా ఆయన చేసిన ఎమోషనల్ పోస్టు నెటిజన్ ల హృదయాలను కలచివేసింది.ఇక సోనూ సూద్ మూవీల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు.


Share

Related posts

Rc15: శంకర్-రామ్ చరణ్ సినిమా అనుకున్న టైమ్ కే..! భారీ సెట్ కూడా..!!

Muraliak

‘సోలో బ్రతుకే సో బెటర్’ ఓటిటి కి కాదు..!  పే పర్ వ్యూ పద్ధతిలో ఒకసారి చూసేందుకు ఎంతంటే….

arun kanna

Balakrishna : బాలకృష్ణ BB3 కంటే రవితేజ ఖిలాడి మీదే అందరి అంచనాలు ..సీన్ రివర్స్ అయితే ..?

GRK