Mahesh Babu : మహేష్ బాబు “భరత్ అనే నేను” సినిమాతో స్టార్ట్ చేసి “మహర్షి”, “సరిలేరు నీకెవ్వరు” సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ క్రియేట్ ఖాతాలో వేసుకుని మంచి జోరుమీద ఉన్నాడు. ఇలాంటి తరుణంలో “గీత గోవిందం” డైరెక్టర్ తో “సర్కారు వారి పాట” అనే సినిమా మహేష్ స్టార్ట్ చేయటం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ దుబాయిలో శరవేగంగా సాగుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో..దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 21వ నాటికి సినిమాకి సంబంధించిన షెడ్యూల్ పూర్తిగా కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ రావడానికి రెడీగా ఉన్న తరుణంలో సినిమాకి సంబంధించి వర్కింగ్ స్టిల్స్ ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెంచేస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు షూటింగ్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది తాజాగా మరికొన్ని ఫోటోలు షూటింగ్ లొకేషన్ లో జరుగుతున్నా సన్నివేశాలు రిలీజ్ చేయడం జరిగింది. దీంతో తాజాగా రిలీజ్ అయిన మహేష్ బాబు ఫోటోలు అదరగొడుతున్నాయి. జుట్టు పెంచుకుని చాలా హ్యాండ్సమ్ కాలేజీ కుర్రాడు తరహాలో తాజాగా రిలీజ్ అయిన ఫోటో ఇంటర్ నెట్ లో వైరల్ అవుతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!