స్వచ్ఛ్‌భారత్ విజయం: మోదీ

ఢీల్లీ, డిసెంబర్ 30: సులభతర వాణిజ్యంలో భారత్ అద్భుత ప్రగతి సాధించిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 51వ ఎపిసోడ్‌లో ఆదివారం మాట్లాడుతూ సమిష్టి కృషితో ఈ ఏడాది అన్ని రంగాల్లో భారత్ పురోభివృద్ధి సాధించిందని అన్నారు. సౌర విద్యుత్, వాతావరణ మార్పుల విషయంలో భారత్ సాధించిన ప్రగతిని ప్రపంచ దేశాలు చెప్పుకుంటున్నాయన్నారు. జనవరి 15న ప్రారంభమయ్యే కుంభమేళా జాతర భారత దైవ చింతనకు నిదర్శమని తెలియజేశారు. గత ఏడాది కుంభమేళా జాతరను గొప్ప మానవ సాంప్రదాయాల చారిత్రక జాతరగా యూనెస్కో గుర్తించిందన్నారు. స్వచ్ఛ్‌ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశంలో 90శాతం పారిశుద్ధ ఫలితాలు సాధించామని వివరించారు . పేదరిక నిర్మూలనకు దేశం చేపడుతున్న కార్యక్రమాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయని అన్నారు. సైక్లింగ్ దిగ్గజం వేదాంగి కులకర్ణి, ఉమెన్ బాక్సర్ రజనీకి ప్రధాని అభినందనలు తెలిపారు.