NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

హైదరాబాద్ లో తెలుగు తమ్ముళ్ల దుకాణం బంద్ ఐనట్టేనా? : బాబు తీరుపై ఆందోళన

 

 

అందరిదీ ఒక దారి ఉలిపి కట్టేది మరోదారి అన్నట్టుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. హైదరాబాద్ను తామే నిర్మించామని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రచారం సైతం ఈ ఇంటి నుంచి బయటకు రాకపోవడం ఆ పార్టీ వర్గాల్లోనే విస్మయపరుస్తోంది. హైదరాబాద్లోని ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్న చంద్రబాబు కనీసం గ్రేటర్ ఎన్నికలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దీనిపై ఆ పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మాత్రం దానికి 100 మంది అభ్యర్థుల వరకు నిలబెట్టడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. అధినేత పట్టించుకోకపోతే తాము గెలుస్తామని, అలాంటప్పుడు తమను అభ్యర్థిగా ప్రకటించడం ఎందుకంటూ కార్పొరేటర్ అభ్యర్థులు సైతం ప్రచారానికి సైతం తిరగడం లేదు. దీంతో ఒకప్పుడు గ్రేటర్లో వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ కు ఇప్పుడు కనీసం జండా మోసే కార్యకర్తలు సైతం దొరకని దౌర్భాగ్య స్థితికి చేరుకుంది. దీన్ని సగటు టిడిపి కార్యకర్త ఒప్పుకోకుండా ఇది మాత్రం అక్షర సత్యం.

ఎందుకీ పరిస్థితి

హైదరాబాద్లో సెటిలర్లు అధికం. ఆంధ్ర నుంచి వచ్చిన వారు ఎక్కువగా కనిపిస్తారు. కూకట్పల్లి, జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ మల్కాజ్గిరి మహేశ్వరం వంటి నియోజకవర్గల్లో వీరు ఎక్కువగా కనిపిస్తారు. ఇతర నియోజకవర్గాల్లో సైతం వీరు ప్రాబల్యం ఎక్కువ. గతంలో సెటిలర్లు టిడిపిని సొంత పార్టీ గా భావించేవారు. అయితే 2016 గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి కు దక్కిన పరాభవం ఆ పార్టీ మనుగడనే ప్రశ్నించింది.
* హైదరాబాద్ను తానే నిర్మించాం అని చెప్పుకునే చంద్రబాబు పార్టీ నిర్వహణ విషయంలో హైదరాబాదును వదిలేశారు. అక్కడ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహించడం మీద దృష్టి నిలరాలేదు. కనీసం పార్టీ కార్యవర్గాన్ని సమయానికి ప్రకటించండం లోను జాప్యం చోటుచేసుకుంది.
* కూకట్పల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో నందమూరి సుహాసిని బరిలోకి దింపారు అయితే ఆమె ఘోరంగా ఓడిపోయారు. కూకట్పల్లి నియోజకవర్గం లో ఉన్న సొంత సామాజిక వర్గం నేతలు సైతం ఆమెను తిరస్కరించారు. దీని తర్వాత టిడిపికి చెందిన చిన్న స్థాయి కార్యకర్తలు సైతం టీఆర్ఎస్ వైపు వెళ్లిపోయారు.
* 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం పరిపాలనా పరమైన అంశాలకు ఆంధ్రకు పరిమితమయ్యారు. పార్టీ నిర్మాణంలో తెలంగాణను పూర్తిగా వదిలేశారు. దీనివల్ల అక్కడ తీరని నష్టం చేకూరింది. అందులో ఉన్న తెలంగాణలో టిడిపి ను కేవలం ఆంధ్ర పార్టీ గాని పరిగణించడం మొదలైంది.
* టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి కనీసం ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవడం సభ్యత్వ నమోదుకు వెనుకంజ వేయడం వంటి విషయాలు పార్టీని వెనక్కి నెట్టేశాయి.
* ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 150 సీట్లకు గట్టిపోటీ ఇచ్చే సామర్ధ్యం ఉన్న టిడిపి ఇప్పుడు అభ్యర్థుల వేట విషయంలోనూ వెనుకబడింది. ఎవరు టిడిపి తరఫున పోటీ చేసేందుకు ముందుకు రాకపోవడం ఆ పార్టీ నాయకులే నివ్వెరపరిచింది.
* తాజాగా చంద్రబాబు లోకేష్ సైతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోవడం, ఒకవేళ పాల్గొన్న ఎలాంటి నాయకత్వం బలపరచాలి అన్న విషయాన్ని ప్రజలకు చెప్పే విషయంలోనూ కొంత స్పష్టత లోపించడంతో టిడిపి అధినాయకత్వం గ్రేటర్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం మానేసింది.

ఇంక ఏముంది?

గ్రేటర్ ఎన్నికలు అధికార తెరాసకు బిజెపికి మధ్య ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మజ్లిస్ పార్టీ తన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. జనసేన పార్టీ ఆంధ్రాలో ఉన్న పొత్తు ద్వారా బిజెపికి మద్దతిచ్చి గ్రేటర్ ఎన్నికల్లో భాగస్వామ్యం ఉందని చాటి చెబుతోంది. ఇక ఆంధ్రలో అధికారం లో ఉన్న వై ఎస్ ఆర్ సి పి తాము పోటీ లో ఉండబోము అంటూ ప్రకటించి చేతులు దులుపుకుంది. అయితే టీడీపీ మాత్రం పోటీకి వంద మంది అభ్యర్థులు ప్రకటించి, ప్రచారం కి వచ్చినప్పుడు వెనక్కు తగ్గడం ఆ పార్టీ కార్యకర్తలను మరింత నిస్తేజానికి గురి చేస్తోంది. ఇంత మాత్రం దానికి అభ్యర్థుల ప్రకటన ఎందుకు చేశారంటూ ఆ పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు మండిపడుతున్నారు. ఈ సారి కనీసం ఒకటి, అర గెలిస్తే టీడీపీ పూర్తిగా హైదరాబాద్ లోను జండా పీకడం ఖాయమంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N