NewsOrbit
న్యూస్ హెల్త్

జలుబు వేదిస్తోందా..అయితే త్వరగా తగ్గడానికి ఈ పనులు చేయండి..!

చలికాలం, వర్షాకాలాలు వచ్చాయంటే చాలు సీజనల్ వ్యాధులు చుట్టుకుంటాయి. అందులోనూ ముఖ్యమైనది జలుబు. జలుబు వచ్చిందంటే చాలు తలంతా పట్టేసినట్టయి ఏ పని చేయడానికి ఇష్టపడకపోతుంటారు. ఇది సామాన్యంగా అంత తొందరగా కూడా వదలదు. మందులను వాడినా దానిపై ఎక్కువగా ప్రభావం చూపకపోవడం మూలంగానో ఏమో కాని మనిషిని జలుబు అంతా తొందరగా వదలలేదనేది అందరికీ తెలిసిందే. జలుబు చుట్టుకుందంటే చాలా పక్కా వారం రోజులు ఉండాల్సిందే. దీనిమూలంగా ముక్కుదిబ్బడ, తలనొప్పి సమస్య కూడా వస్తుంది.

అలాగే జలుబు తీవ్రత మరింత ఎక్కువైతే కొందరిలో జ్వరం కూడా వస్తుంటుంది. అయితే జలుబు సమస్యను నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని మార్గాలను ఉన్నాయి. వాటిని పాటిస్తే సరి జలుబు హాం ఫట్ అయిపోతుంది. మరి అవేంటో చదివేయండి.. అయితే జలుబు నుంచి ఉపశమనం పొందాలంటే గోరువెచ్చటి నీరు తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. దీనితో పాటుగా గోరువెచ్చటి సూప్స్ తాగితే కూడా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చునని కొందరు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే గ్రీన్ టీ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్లు సంవృద్ధిగా ఉండటం మూలంగా శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా వైరస్ లను చంపుతాయి. దీంతో జలుబు తగ్గడానికి అవకాశముంటుంది. అయితే జలుబు చేసినప్పుడు ప్రతిరోజు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తాగితే జలుబు తగ్గిపోతుంది. అలాగే జలుబును తగ్గించడంలో వెళ్లుల్లి రెబ్బలు కూడా సహకరిస్తాయి. వెళ్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉండటం మూలంగా జలుబు తొందరగా తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే వెళ్లుల్లి రెబ్బలను పూటకు ఒకటి తీసుకోవాలి.

ముఖ్యంగా జలుబు వచ్చినప్పుడు రెస్ట్ చాలా అవసరం. రెస్ట్ తీసుకోవడం మూలంగా వ్యాధినిరోధక శక్తి పెరిగి జలుబు తొందరగా తగ్గడానికి అవకాశముంటుంది. అలాగే జబును తగ్గించేందుకు నారింజ పండ్లు కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల జలుబు తొందరగా తగ్గిపోతుంది. వీటితో పాటుగా గుమ్మడికాయ గింజలు, పసులు, అల్లం, క్యారెట్లు, చికెన్ సూప్ లు కూడా జలుబును తరిమికొట్టడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మీకు కూడా జలుబు వేదిస్తుంటే లేట్ చేయకుండా ఈ చిట్కాలను పాటించి ఉపశమనం పొందండి మరి..!

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N