NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

TDP Janasena: టీడీపీ, జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితా విడుదలైంది. టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక వేదికపై నుండి అభ్యర్ధుల పేర్లు ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించింది టీడీపీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయిదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా, చంద్రబాబు 94 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఆరాచక పాలనకు ముగింపు పలకడమే కూటమి లక్ష్యమని చంద్రబాబు, పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..బీజేపీ సీట్ల సర్దుబాటును దృష్టిలో పెట్టుకుని జనసేన 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. ప్రయోగాల జోలికి వెళ్లకుండా, తక్కువ సీట్లైనా పర్వాలదేని, అన్నీ ఆలోచించే తాము ముందడుగు వేశామని అన్నారు.

నాయకులు అందరూ వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని సూచించారు. టీడీపీ ఓటు జనసేనకు ఎంత ముఖ్యమో, జనసేన ఓటు టీడీపీకి అంతే ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టిపరిస్థితుల్లోనూ చీలకూడదని అన్నారు. జనసేనకు ప్రకటించాల్సిన 19 స్థానాలకు ఒకటి రోజుల్లో అభ్యర్ధులను ప్రకటిస్తామని పవన్ తెలిపారు. జనసేన – టీడీపీ కూటమికి బీజేపీ మద్దతు ఉందని తెలిపారు.

జనసేన అభ్యర్ధులు

నెలిమర్ల – లోకం నాగ మాధవి
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
తెనాలి – నాదెండ్ల మనోహర్

టీడీపీ అభ్యర్ధులు

ఆముదాలవసల – కూన రవికుమార్
ఇచ్చాపురం – బెందాళం అశోక్
టెక్కలి – అచ్చెన్నాయుడు
రాజాం – కొండ్రు మురళీమోహన్
అరకు – దొన్ను దొర
కురుపాం – జగదీశ్వరి
పార్వతీపురం – విజయ్ బొనెల
సాలూరు – గుమ్మడి సంధ్యారాణి
బొబ్బిలి – బేబీ నాయన

గజపతి నగరం – కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం – పూసపాటి అదితి
నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
పాయకరావుపేట – వంగలపూడి అనిత
విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు
విశాఖ వెస్ట్ – గణబాబు
ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
పి గన్నవరం – మహాసేన రాజేష్
కొత్తపేట – బండారు సత్యానందరావు
మండపేట – జోగేశ్వరరావు

రాజమండ్రి – ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం – చినరాజప్ప
తుని – యనమల దివ్య
అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
ఆచంట – పితాని సత్యనారాయణ
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఉండి – మంతెన రామరాజు
తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
చింతలపూడి – సొంగా రోషన్ కుమార్
తిరువూరు – కొలికపూడి శ్రీనివాసరావు
నూజివీడు – కొలుసు పార్థసారథి
ఏలూరు – బడేటి రాధాకృష్ణ
గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు

గుడివాడ – వెనిగండ్ల రాము
పెడన – కాగిత కృష్ణ ప్రసాద్
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
పామర్రు – కుమార్ రాజా
విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడ ఈస్ట్ – గద్దే రామ్మోహన్
జగ్గయ్య పేట – శ్రీరామ్ తాతయ్య
నూజివీడు – కొలుసు పార్థసారథి
నందిగామ – తంగిరాల సౌమ్య
తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్
మంగళగిరి – నారా లోకేష్
పొన్నూరు – ధూళిపాళ్ల నరేందర్ కుమార్
బాపట్ల – నరేంద్ర వర్మ
ప్రత్తిపాడు – బూర్ల రామాంజనేయులు

చిలకలూరి పేట – ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ
వినుకొండ – జీవీ ఆంజనేయులు
మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి
రేపల్లె – అనగాని సత్యప్రసాద్
ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు
పర్చూరు – ఏలూరి సాంబశివరావు
సంతనూతలపాడు – బీఎన్ విజయ్‌కుమార్
అద్దంకి – గొట్టిపాటి రవికుమార్
ఒంగోలు – దామచర్ల జనార్థనరావు
కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహరెడ్డి
కొండెపి – డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి
కావలి – కావ్య కృష్ణారెడ్డి
నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ

నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
గూడూరు – పాశం సునీల్ కుమార్
సూళ్లూరు పేట – విజయ శ్రీ
ఉదయగిరి – కాకర్ల సురేష్
కడప – మాధవి రెడ్డి
రాయచోటి – రాంప్రసాద్ రెడ్డి
పులివెందుల – బీటెక్ రవి
మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్
ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియ రెడ్డి
శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి
కర్నూలు – టీజీ భరత్
పాణ్యం – గౌరు చరితా రెడ్డి
నంద్యాల – ఎన్‌ఎండీ ఫరూక్
బనగానపల్లె – బీసీ జనార్థన్ రెడ్డి

డోన్ – కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
పత్తికొండ – కేఈ శ్యాంబాబు
కొడుమూరు – దస్తగిరి
రాయదుర్గం – కాలువ శ్రీనివాసులు
ఉరవకొండ – పయ్యావుల కేశవ్
తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి
శింగనమల – బండారు శ్రావణి శ్రీ
కళ్యాణ దుర్గం – అమిలినేని సురేంద్రబాబు
రాప్తాడు – పరిటాల సునీత
మడకశిర – సునీల్ కుమార్

హిందూపురం – నందమూరి బాలకృష్ణ
పెనుకొండ – సవితమ్మ
తంబళ్లపల్లె – జయచంద్రారెడ్డి
పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
నగరి – గాలి భాను ప్రకాష్
గంగాధర నెల్లూరు – బీఎం థామస్
చిత్తూరు – గురజాల జగన్‌మోహన్
పలమనేరు – అమర్‌నాథ్ రెడ్డి
కుప్పం – నారా చంద్రబాబునాయుడు

టీడీపీ అభ్యర్ధుల జాబితా కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N