NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ ఇద్ద‌రు పెద్ద రెడ్ల‌ను వ‌దిలేస్తోన్న జ‌గ‌న్‌… ఊహించ‌ని షాక్‌లు ఇవి…!

నిజంగానే జ‌గ‌న్ ప‌లువురు కీల‌క నేత‌ల‌ను కూడా ప‌క్క‌న పెట్టేయ‌డ‌మో లేదా వ‌దిలించుకోవ‌డ‌మో చేసేస్తున్నారు. అస‌లు కొంత‌మంది సైడ్ అవుతోన్న తీరు చూస్తుంటే జ‌గ‌న్ త‌న‌కు న‌చ్చ‌క‌పోతే ఎలాంటి పెద్ద వాళ్ల‌ను అయినా, స‌న్నిహితుల‌ను అయినా, త‌న బంధువుల‌ను అయినా ప‌క్క‌న పెట్టేస్తార‌ని తాజా ప‌రిణామాలే చెపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రు వైసీపీ టాప్ లీడ‌ర్ల‌ను కూడా వ‌దిలించేసుకోవ‌డానికి రెడీ అయిన‌ట్టుగా క‌న‌ప‌డుతోంది. జ‌గ‌న్ బంధువు, వ‌రుస‌కు మావ అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి విష‌యంలో జ‌గ‌న్ తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు.

బాలినేని ఫ‌స్ట్ లిస్ట్ రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్ తీరు ప‌ట్ల బెదిరిస్తూనే వ‌స్తున్నారు. అయినా జ‌గ‌న్ లైట్ తీస్కొంటున్నారు. ఇక ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లోకి ఎప్పుడు అయితే చెవిరెడ్డిని ఎంట‌ర్ చేయించారో అప్ప‌టి నుంచి బాలినేనికి మ‌రింత టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఇంకా ఒంగోలు సీటు విష‌యంలో జ‌గ‌న్ ఎలాంటి డెసిష‌న్ అయితే తీసుకోలేదు. పైరుకు మాత్రం బాలినేని రెండున్న‌రేళ్లు మంత్రిగా ఉన్నా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ఒంగోలులో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇప్పుడు జ‌గ‌న్ సీటు ఇంకా చెప్పాలంటే చేతికి బీ ఫామ్ వ‌చ్చే వ‌ర‌కు బాలినేనికి సీటు ఉంటుందా లేదా ? అన్న‌ది డౌటే.

అటు వేమిరెడ్డి వివాద ర‌హితుడు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆర్థికంగా బాగా ఖ‌ర్చు చేశారు. జ‌గ‌న్ కు కూడా ఆయ‌న అంటే చాలా ఇష్టం. ఆయ‌న ప‌ట్టుబ‌ట్టాడ‌నే త‌న‌కు అత్యంత ఆప్తుడు అయిన అనిల్ కుమార్ యాద‌వ్‌ను న‌ర‌సారావుపేట‌కు మార్చేశారు. అయితే ఇప్పుడు అదే వేమిరెడ్డి కొంత అల‌క‌బూని ఢిల్లీ వెళ్లిపోయారు. ఒక‌టి రెండు సార్లు ఆయ‌న‌తో మాట్లాడేందుకు ట్రై చేసిన జ‌గ‌న్ చివ‌ర‌కు విసుగు వ‌చ్చేసి వేమిరెడ్డిని కూడా వ‌దిలించుకోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది.

వేమిరెడ్డిని బ‌తిమిలాడ‌డం ఇష్టం లేని జ‌గ‌న్ నెల్లూరు పార్ల‌మెంటుకు పోటీ చేసేందుకు ఎవ‌రో ఒక‌రిని చూడాల‌న్న బాధ్య‌త‌ను కూడా అనిల్ కుమార్ యాద‌వ్‌కే అప్ప‌గించిన‌ట్టుగా తెలుస్తోంది. తాజాగా జిల్లాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల బాధ్య‌త‌ల నుంచి కూడా వేమిరెడ్డిని త‌ప్పించేసిన జ‌గ‌న్ ఆ ప్లేస్‌ను కూడా చెవిరెడ్డితో భ‌ర్తీ చేసేశారు. ఏదేమైనా ప్ర‌కాశం జిల్లా నుంచి బాలినేని శ‌త్రువు సుబ్బారెడ్డికి రాజ్య‌స‌భ సీటు ఇచ్చారు. ఇటు చెవిరెడ్డికి జిల్లా పెత్త‌నం ఇచ్చారు. అప్పుడే బాలినేని ప్రాధాన్య‌త ఎలా త‌గ్గిందో తెలుస్తోంది.

రేపు నెల్లూరు పెత్త‌నం మ‌రొక‌రికి ఇస్తే అక్క‌డ కూడా వేమిరెడ్డిని సైడ్ చేసేసిన‌ట్టే అవుతోంది. ఏదేమైనా జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తులు అయినా స‌రే ఎలా సింపుల్‌గా సైడ్ అవుతారో ? ఆయ‌న సైడ్ చేసేస్తారో పై ఇద్ద‌రు నేత‌లే పెద్ద నిద‌ర్శ‌నం అనుకోవాలి.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

YSRCP: సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన .. ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట

sharma somaraju

Kapu Ramachandra Reddy: రాజ్‌నాథ్ సింగ్ ను కలిసిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ..బీజేపీ గూటికి చేరేందుకే(గా)..!

sharma somaraju

CV Ananda Bose: దీదీ సర్కార్ కు గవర్నర్ సీవీ ఆనంద బోస్ హెచ్చరిక

sharma somaraju

Gaganyaan: గగన్‌యాన్ లో పర్యటించే వ్యోమగాముల పేర్లు ప్రకటించిన ప్రధాని మోడీ

sharma somaraju

చేతులు క‌లిసినా మ‌న‌సులు క‌ల‌వ‌ని జ‌న‌సేన – టీడీపీ.. ఇంత‌క‌న్నా ఫ్రూప్స్ కావాలా…!

Top 10 OTT Movies: ఓటీటీలో బెస్ట్ మూవీస్ గా కొనసాగుతున్న తెలుగు సినిమాలు ఇవే..!

Saranya Koduri

జ‌గ‌న్ ఓడితే ఏంటి.. చంద్ర‌బాబు ఓడితే ఏంటి… దెబ్బ ప‌డేది ఎవ‌రికంటే…!

Chandrababu: హనుమ విహారి వివాదంపై స్పందించిన చంద్రబాబు

sharma somaraju

Dear Kavya: యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్న “డియర్ కావ్య ” వెబ్ సిరీస్.. నటీనటుల వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీతో టీడీపీ – జ‌న‌సేన స్నేహం ఉందా.. ఉండీ లేదా… !

ఈ సిట్టింగ్ సీట్ల‌లో వైసీపీ ఓట‌మి ఎవ్వ‌రూ ఆప‌లేరా.. జ‌గ‌న్ చేతులెత్తేసిన‌ట్టే..!

ఆ 22 సీట్ల‌లో టీడీపీని గెలిపిస్తోన్న ప‌వ‌న్‌.. ఆ సీట్లు.. ప‌క్కా లెక్క‌లివే…!

ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు.. ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేరా…!

The Kerala story: OTT ని షేక్ చేస్తున్న ది కేరళ స్టోరీ..!

Saranya Koduri

Krishna Mukunda Murari February 27 2024 Episode 404: మురారి ముకుంద ఒక్కటి అవుతున్నారని విన్న కృష్ణ.. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella