NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa February 12 2024 Episode 149: వైజయంతికి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్న అభిషేక్, ఎందుకు రమ్మన్నాడని టెన్షన్ పడుతున్న వైజయంతి..

Paluke Bangaramayenaa Today Episode February 12 2024 Episode 149 Highlights

Paluke Bangaramayenaa February 12 2024 Episode 149: వైజయంతి యశోదకి ఫోన్ చేస్తుంది. ఏంటి మేడం మాకు ఫోన్ చేశారు అని యశోద అడుగుతుంది. పెళ్లి కావాల్సిన పిల్ల మీ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి యశోద గారు మీరు ఒక ఇద్దరు ఆడపిల్లలకు తల్లిగా ఆలోచించండి పెళ్లి కావలసిన అమ్మాయి మీ ఇంట్లో ఉంటే నలుగురు నానా మాటలు అనుకుంటారు మా అమ్మాయికి పెళ్లి అవుతుందా జరిగిందేదో జరిగిపోయింది మా అమ్మాయిని మా ఇంటికి పంపించేయండి అని వైజయంతి అంటుంది. మీ అమ్మాయిని పంపించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేడం కానీ స్వర కోలుకునేదాకా పంపిచోద్దనేది మా అభి అభిప్రాయం వాడికి మళ్ళీ ఒకసారి చెప్పి చూస్తాను అని యశోద అంటుంది. చాలా థాంక్స్ యశోద గారు మా అమ్మాయిని మా ఇంటికి పంపిస్తున్నందుకు అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే, యశోద కాఫీ తీసుకువెళ్లి అభికి ఇచ్చిరా అని వాళ్ల అత్తయ్య అంటుంది. ఇంతలో అభి వచ్చి అమ్మ నేను బయటికి వెళ్లి వస్తాను అని అంటాడు. అభి నీతో ఒక విషయం మాట్లాడాలి అని యశోద అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 12 2024 Episode 149 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 12 2024 Episode 149 Highlights

ఏంటో చెప్పమ్మా అని అభిషేక్ అంటాడు. స్వర కోలుకుంటే వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అన్నావు కదా నాన్న ఇప్పుడు తన పనులు తను చేసుకుంటుంది వాళ్ళ ఇంటికి పంపించేశారా ఎంతైనా పెళ్లి కావాల్సిన పిల్ల కదా తను ఎన్నాళ్ళు మన ఇంట్లో ఉంటుంది అని యశోద అంటుంది. స్వర వాళ్ళ అమ్మ రెండు మూడు సార్లు మన ఇంటికి వచ్చి వెళ్ళింది ఇప్పుడు ఫోన్లు కూడా చేస్తుంది ఎంతైనా వాళ్ళ కూతురే కదరా పంపించేసేయ్ అని యశోద అంటుంది. అలాగే అమ్మ నాయుడు అంకుల్ తో మాట్లాడి పంపిస్తాను అని అభిషేక్ అంటాడు. వద్దు నాన్నా వైజయంతి గారితో మాట్లాడి పంపించు అని యశోద అంటుంది. కట్ చేస్తే, ఈ విషయం మా అన్నయ్య కంటే ముందు నేనే వైజయంతి మేడంకి చెప్పాలి అని చందన వైజయంతికి ఫోన్ చేస్తుంది. చెప్పు చందన ఏంటి విషయం అని వైజయంతి అంటుంది. తన ఫోన్లో సిగ్నల్ లేకపోవడం వల్ల చందన చెప్పిన మాటలు ఏమీ వినపడక చెప్పు చందన అని  అరుస్తూ ఉంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 12 2024 Episode 149 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 12 2024 Episode 149 Highlights

మా అన్నయ్య మీకు ఫోన్ చేస్తాడు మేడం అని చందన ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో కీర్తి వచ్చి అక్కా నీ ఫోన్ కావాలి ఇవ్వు అని చేతిలో నుంచి ఫోన్ లాక్కొని వెళ్తుంది. చందన ఏం చెప్పాలనుకుని ఫోన్ చేసింది వాళ్ళ అన్నయ్య ఎందుకు ఫోన్ చేస్తానన్నాడు అని ఆలోచిస్తుంది వైజయంతి. ఏం ఆలోచిస్తున్నావ్ వైజయంతి అని రంగరాజు అంటాడు. చందన ఎందుకో ఫోన్ చేసింది రంగరాజు గారు కానీ ఏమీ చెప్పకుండా మా అన్నయ్య మీకు ఫోన్ చేస్తాడు అని చెప్పింది  ఏమై  ఉంటుంది అని వైజయంతి అంటుంది. ఇంతలో అభిషేక్ ఫోన్ చేస్తాడు. ఇదిగో అభి ఫోన్ చేస్తున్నాడు ఏం మాట్లాడుతాడు ఏమో అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం పర్వాలేదు అమ్మ ఎత్తి మాట్లాడు అని రంగరాజు అంటాడు. వైజయంతి కంగారుతో భయపడుతూ ఫోన్ ఎత్తుతుంది. మీరు ఒకసారి రేపు మా ఇంటికి రండి అని అభిషేక్ ఫోన్ కట్ చేస్తాడు. ఏమన్నాడమ్మా అని రంగరాజు అడుగుతాడు. వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాడు రంగరాజు గారు దేనికై ఉంటుంది అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 12 2024 Episode 149 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 12 2024 Episode 149 Highlights

అయితే వెళ్దాం పదమ్మ వెళ్లకపోతే అతనే మన ఇంటికి వచ్చి మనల్ని ఒక ఆట ఆడుకుంటాడు అక్కడ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఏమీ చేయలేడు అని రంగరాజు అంటాడు. అయితే కచ్చితంగా వెళ్లాల్సిందే అని వైజయంతి అంటుంది.కట్ చేస్తే, స్వర నిన్ను మా అన్నయ్య మీ ఇంటికి పంపించాలనుకుంటున్నాడు అని కీర్తి చెబుతుంది. ఎప్పటికైనా వెళ్లి పోవాల్సిందే కదా కీర్తి అని స్వర అంటుంది. ఎందుకు స్వర అబద్ధం చెప్తున్నావ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నీకు ఇష్టం లేదు కదా నాకు తెలుసు స్వర అని కీర్తి అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కీర్తి అని స్వర అంటుంది. నువ్వు మా అన్నయ్యని ఇష్టపడుతున్నావు కాదు స్వర ఆ విషయం మా అన్నయ్యకి చెప్పలేక మా ఇంట్లో వాళ్లకి చెప్పలేక బాధపడుతున్నావు కదా ముందే నువ్వు మా అన్నయ్యకి ఎందుకు పరిచయం కాలేదు

Paluke Bangaramayenaa Today Episode February 12 2024 Episode 149 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 12 2024 Episode 149 Highlights

నేను ఎన్నోసార్లు అనుకున్నాను నువ్వు మాకు వదిన అయితే బాగుండు అని నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం నాకు ఇష్టం లేదు స్వర అని కీర్తి బాధ పడుకుంటూ వెళ్ళిపోతుంది. అభి సార్ కన్నా నువ్వే నన్ను ఎక్కువగా అర్థం చేసుకున్న కీర్తి కానీ వెళ్ళవలసి వస్తుంది అభీ సార్ కి నిజం చెప్పేదాకా నేను ఇకనుంచి వెళ్ళను అని స్వర అనుకుంటుంది.కట్ చేస్తే,ఏం చేస్తున్నావ్ స్వర అని అభిషేక్ అంటాడు.ఏం చేయాలో తెలియక చిన్న పిల్లని అయిపోయాను సార్ బొమ్మలతో ఆడుకుంటున్నాను అని స్వర అంటుంది. నీ ఆరోగ్యం ఎలా ఉంది బాగానే ఉన్నావు కదా అని అభిషేక్ అంటాడు.బాగానే ఉన్నాను సార్ ఆడగలను పాడగలను తినగలను కానీ గెంతలేను బరువులు మోయలేను అని స్వర అంటుంది. ని ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత మీ ఇంటికి పంపించేయాలి అనుకున్నాను కానీ అప్పుడే పంపించేయాల్సి వస్తుంది

Paluke Bangaramayenaa Today Episode February 12 2024 Episode 149 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 12 2024 Episode 149 Highlights

నువ్వు మీ ఇంటికి వెళ్లి పోవాలి స్వర అని అభిషేక్ అంటాడు. అలాగే వెళ్తాను సార్ ఇన్ని రోజులు మీకు ఉద్యోగం లేదని బాధపడేదాన్ని ఇప్పుడు మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు నేను ఇంటికి వెళ్ళిపోతాను కానీ నాకు ఒక మాట ఇవ్వండి సార్ అని స్వర అంటుంది. ఏంటో చెప్పు స్వర అని అభిషేక్ అంటాడు. మీరు మాట ఇస్తే చెప్తాను సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని స్వర అంటుంది. సరే స్వర నీకు మాటేస్తున్నాను చెప్పు అని అభిషేక్ తన చేతిలో చేయి వేసి అంటాడు. మీరు ఇకమీదట మందు మానేయాలి సార్ నేను ఇంటికి వెళ్ళిపోయాను అని నువ్వు మందు తాగితే మళ్ళీ పెట్టే బెడ్డ సర్దుకొని ఇంటికి వచ్చేస్తాను అని స్వర అంటుంది. అలాగే తాగనులే ను వెళ్లి లగేజ్ సర్దుకో అని అభిషేక్ అంటాడు. నిన్ను పంపించాలని నా ఉద్దేశం కాదు స్వర కానీ పంపించాల్సి వస్తుంది నా కొడుకు ఏమైపోతాడో అని నేను పంపించాల్సి వచ్చింది అని యశోద అనుకుంటుంది. స్వర ఏమైనా హెల్ప్ చేయమంటావా అని అభిషేక్ అంటాడు. పర్వాలేదు సార్ నేను సర్దుకోగలను అని స్వరా అంటుంది..

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N