NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

Vote: వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఒక సారి ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో పరిశీలించుకోండి.. లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్క కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి రోజు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలంటే నమోదు చేసుకునేందుకు ఇదే అఖరి అవకాశం. దీన్ని చేజార్చుకుంటే ప్రజాస్వామ్యంలో వజ్రాయుధాన్ని కోల్పోయినట్లే.

సాధారణంగా నామినేష్ల గడువు చివరి రోజు వరకూ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వాటి పరిశీలన, నోటీసుల జారీ, దరఖాస్తుదారుల సమాధానం కోసం వారం రోజులు గడువు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం వరకే ఈసీ అవకాశం కల్పించింది. వీటిని పరిశీలించి అర్హులైన వారందరికీ ఓటరు జాబితాలో చోటు ఇవ్వనుంది. తుది జాబితాకు అనుబంధంగా ఈ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. అందులో పేర్లు ఉన్న వారంతా ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

ఓటర్ల నమోదును ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. https://ceoandhra.in.in  వెబ్ సైట్ లేదా, https://voterportal.eci.gov.in  వెబ్ సైట్ లోకి వెళ్లి ఓటు హక్కు కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. లేదా స్మార్ట్ ఫోన్ లో ప్లేస్టోర్ నుండి voterhelpline యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్, వివరాలతో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయి న్యూఓటర్ రిజిస్ట్రేషన్ అనే విభాగానికి వెళ్లి వివరాలు అన్ని నింపి దరఖాస్తు సబ్మిట్ చేయవచ్చు.  ఆఫ్ లైన్ లో బూత్ స్థాయి అధికారులకు (బీఎల్వో) నేరుగా ఫాం – 6 దరఖాస్తు సమర్పించవచ్చు.

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N