Tollywood heroines: హీరోయిన్స్‌గా మంచి పేరున్నా అవకాశాలిచ్చేవరు లేకపోతే ఆకాంక్ష సింగ్( Akanksha singh), రూహాని శర్మ(Ruhani sharma), ఈషా రెబ్బా(Eesha rebba)ల మాదిరిగానే మిగిలిపోతారు..!

Share

Tollywood heroines: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఒక్కటే కాదు బాలీవుడ్, కోలీవుడ్ సహా మిగతా సౌత్ సినిమా ఇండస్ట్రీలలోనూ ఒకటి రెండు సినిమాలలో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నా కూడా ఆ తర్వాత ఎందుకనో ఆశించిన అవకాశాలు రాక ఉన్నచోటే ఆగిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన గ్లామర్
రోల్స్ చేయడానికి రెడీ అంటూ లేటెస్ట్ గ్లామర్ ఫొటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేకర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ ఎటు వైపు నుంచి కూడా అవకాశం తలుపుతట్టదు. ఒక్కసారి మేకప్ వేసుకొని..హీరోయిన్ అనే ముద్ర పడ్డాక..వచ్చే క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Tollywood heroines Akanksha singh, Ruhani sharma, Eesha rebba are lagging behind...?
Tollywood heroines Akanksha singh, Ruhani sharma, Eesha rebba are lagging behind…?

ఆ క్రేజ్ కోసమే పరితపించే హీరోయిన్స్ మాత్రం రెండు మూడు సినిమాల తర్వాత లైం లైట్‌లోకి రాలేకపోతున్నారు. సుమంత్ హీరోగా వచ్చిన సినిమా మళ్ళీరావా. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఆకాంక్ష సింగ్ పరిచయమైంది. మంచి డీసెంట్ హిట్‌గా నిలిచిన మళ్ళీ రావా తర్వాత ఆకాంక్ష( Akanksha singh)కి మంచి కథా బలమున్న సినిమాలలో అవకాశాలు దక్కుతాయని ఆశించింది. జనాలు కూడా ఆకాంక్ష సింగ్                 ( Akanksha singh) పెద్ద హీరోయిన్ అవుతుందని భావించారు. కానీ ఆ తర్వాత టాలీవుడ్‌లో ఆకాంక్ష          ( Akanksha singh) చేసింది ఒక్క సినిమానే. నాగార్జున,నాని హీరోలుగా వచ్చిన దేవ దాస్ సినిమాలో నాగార్జున సరసన నటించింది.

Tollywood heroines: మొదటి సినిమా సూపర్ హిట్ అయినా ఆ తర్వాత కెరీర్ నత్త నడకన సాగుతోంది.

ఆ తర్వాత మళ్ళీ ఈమెకి అవకాశాలు దక్కలేదు. ఈ సినిమా ఫ్లాప్ ప్రభావం ఆకాంక్ష మీద పడిందనేని ఓ టాక్. ఇక రుహాని శర్మ(Ruhani sharma). అక్కినేని హీరో సుశాంత్ నటించిన చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. పర్ఫార్మెన్స్ పరంగా రుహాని శర్మ(Ruhani sharma),కి మంచి పేరొచ్చింది. అంతేకాదు టాలీవుడ్ యంగ్ హీరోలకి మంచి జోడీ అని..ఆమె ఇక్కడ వరుసగా అవకాశాలు దక్కించుకుంటుందని చెప్పుకున్నారు. కానీ అందరూ చెప్పుకున్నట్టు రుహానీ(Ruhani sharma),కి క్రేజీ ఆఫర్స్ అంటూ ఏవీ రావడం లేదు. మొదటి సినిమా సూపర్ హిట్ అయినా ఆ తర్వాత కెరీర్ నత్త నడకన సాగుతోంది.

రుహానీ(Ruhani sharma), కూడా చి.ల.సౌ తర్వాత ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో వచ్చిన డర్టీ హరి సినిమాలో నటించింది. ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. చెప్పాలంటే ఈ మూవీ
ద్వారా రుహానీ(Ruhani sharma),కి ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. ఇక అదే ఏడాది హిట్ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నటించింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే హీరోకి పెద్ద క్రేజ్
లేకపోవడం వల్ల ఈ సినిమా కూడా రుహానీ(Ruhani sharma), కి అంతగా ఉపయోగపడలేదు. ఇదే క్రమంలో ఇటీవల దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ నటించిన నూటొక్క జిల్లాల
అందగాడులో హీరోయిన్‌గా నటించింది.

 

Tollywood heroines: ఇలాంటి చిన్న హీరోయిన్స్ గురించి పట్టించుకునే మేకర్స్ ఉండటం కష్టమే..!

ఈ సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఇలాంటి సినిమాలను ఒప్పుకోవడం వల్లే రుహాని శర్మ(Ruhani sharma), ఆకాంక్ష సింగ్( Akanksha singh) లాంటి వారి కెరీర్ ఆశించినంతగా సాగడం లేదు అని
చెప్పుకుంటున్నారు. పెద్ద హీరోల సినిమాలలో అవకాశం దక్కించుకోవాలంటే ఇలాంటి హీరోయిన్స్ వల్ల అయ్యే పని కాదు. ఎప్పుడో ఇండస్ట్రీకొచ్చి మూడు నాలుగు సినిమాలతో హిట్ అందుకున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బ(Eesha rebba) కూడా అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోల సరసన నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇక ఇలాంటి చిన్న హీరోయిన్స్ గురించి పట్టించుకునే మేకర్స్ ఉండటం కష్టమే అనేది ఇండస్ట్రీలోని ఓ వర్గం చెప్పుకునే మాట.


Share

Related posts

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ లీడర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్ సిపి..!!

sekhar

బిగ్ బాస్ 4 : హారిక లోపల ఉంటే… ఆమె అన్న, అమ్మ ఏం చేశారో చూడండి..! ఎమోషనల్ అయిపోయిన హారిక

arun kanna

SVP: “సర్కారు వారి పాట” మ్యూజిక్ రైట్స్ దక్కించుకున్న ఆ టాప్ సౌత్ ఇండియా సంస్థ..!!

sekhar