principles of Mars: మంగళ సూత్రాలకు దేవుని ప్రతిమ చెక్కించుకుంటున్నారా ?ఇది తెలుసుకోండి!!

Share

principles of Mars: ఆడవారి మంగళసూత్రాలు
హిందువుల (hindus) యొక్క వివాహా బంధంలో మంగళ్యానికి మంగళ సూత్రానికి చాలా విలువతో కూడిన  ప్రాధాన్యత  ఇవ్వబడింది.పురుషుడు  తన జీవన గమనం లో  తోడు కొరకు ,కుటుంబ అభివృద్ధి చేసుకోవడానికి   తన యొక్క అర్ధ భాగస్వామిగా ఎంచుకున్న  స్త్రీ  మెడలో  తాళి కట్టి తన అర్ధాంగిగా చేసుకుంటాడు.ఆ మంగళ సూత్రం కట్టే  కార్యక్రమ సమయంలో వేద పండితులు మాంగళ్య మంత్రాన్ని పెళ్లి  కుమారుడు కి  వినిపించి,అనిపించి ఆ భావార్ధం ను వివరంగా  తెలియజేస్తారు.వేద మంత్రాల సాక్షిగా కట్టిన ఈ తాళి కి చాలా పవిత్రత ,శక్తి ఉన్నాయి.ఆడవారి మంగళసూత్రాలు బంగారం తో చేసిన వాటిని గుచ్చడానికి  మధ్యలో వాడే  తాడు మాత్రం పసుపుతాడు వాడాలి తప్ప  ఏ లోహాలతో తయారు చేసిన వాటిని  ఉపయోగించకూడదు.  సూత్రాలలో  సర్వమంగళాదేవి కొలువై ఉంటుంది.  కాబట్టి అత్యంత పవిత్రంగా చూసుకోవాలి.  కొందరు మంగళసూత్రం పైన బొమ్మలు చెక్కించడం , రంగులు అద్దించడం  వంటివి చేస్తున్నారు.మరి కొంతమంది లక్ష్మీ అమ్మవారి బొమ్మ మంగళసూత్రం పై కనిపించే విధంగా  చేయించుకుంటారు.   అసలు ఇలా వాడొచ్చా లేదా అనేది తెలుసుకుందాం.

principles of Mars:  రాముల వారి బొమ్మ

మనకు తెలిసి   ఆదర్శ దంపతులు అంటే   సీతారాములు. సీతమ్మ కి  రాముడంటే  ఎంత ఇష్టమో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ  సీతమ్మ తల్లి తన మంగళ సూత్రం మీద  రాముల వారి బొమ్మ గాని, రంగులు కానీ అద్దించుకోలేదు. సీతమ్మ ఎలాగైతే మంగళసూత్రాన్ని  వేసుకుందో అలా మనం కూడా  చేస్తే కచ్చితంగా సిరి సంపదలు  కలుగుతాయి.
కొందరికి  వేంకటేశ్వరస్వామి అంటే ఇష్టం. మరికొందరికి దుర్గమ్మ  అంటే ఇష్టం. ఇంకొంతమందికి మిగిలిన దేవుళ్ళు అంటే  ఇష్టం. ఇలా ఎవరికి ఇష్టమొచ్చిన దేవుడిని వారు మంగళసూత్రం మీద    వేయించుకుంటున్నారు. అలా దేవుని ప్రతిమలు ఎట్టి పరిస్థితుల్లో కూడా  మంగళసూత్రాలు వేసుకోకూడదు. అతి ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ  ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు తీసుకోకూడదు.  ఒకవేళ వేసుకుంటే సిరిసంపదలు తగ్గిపోతూ  కష్టాలు   మొదలవుతాయి. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా  చేయించుకుని వేసుకోవడం మంచిది.   మంగళసూత్రానికి ఏ రకమైన పిన్నులు ,  ఇనుముకు సంబంధించిన వస్తువులు పెట్టుకోకూడదు.  వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి  వచ్చేలా మంగళసూత్రాలు      వేసుకోవాలి.

మంగళసూత్రం పెరిగితే

మంగళసూత్రాల కి  ఎప్పుడు  పగడం,  నలుపు పూసలు ముత్యాలు ఉండాలి. పొరపాటున మంగళసూత్రం పెరిగితే  (ఊడిపోతే) వెంటనే 5 వరుసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము ను  తీసుకుని     దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ  వేయించి  వారి చేతే మెడలో కట్టించుకోవాలి. సమయానికి ఎవరూ లేకపోతే    మాత్రం తమకు తామే  ముడి వేసుకోవాలి.
తర్వాత మంచి రోజు చూసుకుని     ఉదయం 8  గంటల లోపు     మంగళసూత్రాలు మెడలో వేసుకోవాలి.  ఈ నియమాలు  భార్య పాటిస్తే భర్త  దీర్ఘ ఆయుష్షు తో ఉంటాడు.  భర్త కి వచ్చే గండాలు ఏమైనా ఉంటే తప్పి పోయి వందేళ్లు సుఖంగా జీవిస్తారు అని  శాస్త్రాలు  తెలియచేస్తున్నాయి.


Share

Related posts

Bigg Boss 5 Telugu: షణ్ముక్ అలా తిట్టకుండా ఉండాల్సింది అంటున్న జనాలు..!!

sekhar

RRR: RRR సినిమాలో రాజమౌళి మార్క్ స్పెషల్ ఫైట్ సీన్..??

sekhar

నలుపు లేని అండర్ ఆర్మ్స్ కోసం తీసుకోవాలిసిన జాగ్రత్తలు పాటించవలిసిన  చిట్కాలు తెలుసుకోండి !!( పార్ట్-2)

siddhu