ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుపై క్లారిటీ ఇచ్చేసిన టీఆర్ఎస్..విపక్ష పార్టీల అభ్యర్ధి మార్గరేట్ అల్వాకే ఓటు

Share

ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో మద్దతుపై టీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటి వరకూ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుపై ఇచ్చే అంశంపై మౌనం వహించిన టీఆర్ఎస్ .. నేడు తన నిర్ణయాన్ని వెల్లడించింది. విపక్ష పార్టీల ఉప రాష్ట్రపతి అభ్యర్ధి మార్గరేట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు అందరూ మార్గరేట్ అల్వాకు ఓటు వేయాలని అధిష్టానం నిర్ణయించింది. మార్గరేట్ అల్వాకు 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఓటేయనున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనను టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు విడుదల చేశారు.

 

పార్లమెంట్ భవనంలో రహస్య బ్యాలెట్ విధానంలో రేపు ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 788 మంది ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికకు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఆర్ ఓ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా జగదీప్ ధన్ ఖడ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో మాదిరిగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎన్డీఏ అభ్యర్ధి జగదీప్ ధన్ ఖడ్ కు మద్దతు ఇవ్వాలని ఏపికి చెందిన అధికార వైసీపీ, టీడీపీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్.. ఉప రాష్ట్రపతి విపక్షాల అభ్యర్ధి కాంగ్రెస్ కు చెందిన నాయకురాలు కావడంతో కొంత అనుమానాలు తలెత్తాయి. మమత బెనర్జీ తరహాలోనే ఎన్నికలకు దూరంగా టీఆర్ఎస్ దూరంగా ఉంటుందన్న ప్రచారం జరిగింది. అయితే చివరకు కాంగ్రెస్ అభ్యర్ధి అయినా సరే ఉప రాష్ట్రపతి అభ్యర్ధి మార్గరేట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.

మహా’ పంచాయతీలో సుప్రీం కీలక ఆదేశాలు .. ఉద్దవ్ కు ఊరట


Share

Recent Posts

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

టాలీవుడ్‌లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొన‌సాగుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ ల‌కు సేమ్ టు సేమ్ ఒకే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి…

22 mins ago

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

1 hour ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

3 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago