పాస్ పుస్తకాలకు 2 కోట్లా… !!

 

పాస్ పుస్తకాలకు 2 కోట్ల రూపాయలా… అని నోరు వెల్లబెట్టకండి ఇది అక్షరాల నిజం. హైదరాబాదు ప్రాంతంలో వివాదంలో ఉన్న  48 కోట్ల రూపాయల విలువైన భూమికి ఈ డీల్. కీసర మాజీ తాసిల్దార్నాగరాజు వివాదంలో ఉన్న భూమికి  రెండు కోట్లు లంచం తీసుకొని పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు ఏసిబి అధికారులు గుర్తించారు.

సదరు వ్యక్తులకు ఈ భూమిని కట్టబెట్టడానికి నాగరాజు భారీ గా నగదు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమిక వివరాలు సేకరించారు.  నాగరాజుతో పాటు పాస్ పుస్తకాలు పొందిన మరొ నలుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఇప్పటికే కోటి 10 లక్షలు లంచం తీసుకున్న కేసులో నాగరాజు జైలులో ఉన్నారు. తాజాగా పాస్ పుస్తకాల కేసులో కూడా మాజీ తాసిల్దార్ నాగరాజును విచారించేందుకు పీటీ వారెంట్ కోసం ఏసీబీ అధికారలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా ఈ కేసుకు సంబంధించి రాంపల్లిదయారా కు చెందిన కందాడి ధర్మారెడ్డి ని అరెస్టు చేసి వివరాలు సేకరిస్తున్నారు.