చిన్నమ్మను చూసి జగన్ పార్టీ జడుసుకుంటోందా!

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి కి ఇవ్వడం వైసీపీకి నచ్చినట్లు లేదు.వైసిపిలో ఉండి వచ్చిన తన భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కారణంగా పురందేరశ్వరి

 

ys jagan party fear about his aunty

ys jagan party fear about his aunty                                                                                                                                                                                                                       ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో పావులు కదుపుతారేమోనన్న అనుమానం ఆ పార్టీ నాయకులను వెంటాడుతోంది.వైసీపీ అగ్ర నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదిక ద్వారా పురంధ్రేశ్వరి మీద ధ్వజమెత్తడం ఇందుకో సూచనగా గోచరిస్తోంది.డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో పరుచూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. డాక్టర్ దగ్గుబాటి ని వైసీపీలో చేసుకునే సమయానికి పురంధరేశ్వరి బిజెపిలో కీలక నేతగా ఉన్నారు. అప్పుడేమీ అభ్యంతరం చెప్పని వైసీపీ అగ్రనేతలు పర్చూరులో దగ్గుబాటి ఓడిపోయాక ఒక పార్టీలో భార్య ,మరో పార్టీలో భర్త ఉండటం సరికాదని ఆ ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో ఉండాలంటూ ప్రతిపాదన పెట్టడం,ఇందుకు పురందరేశ్వరి ఒప్పు కోకపోవడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీని వీడడం జరిగింది.

ఓ రకంగా చెప్పాలంటే అవమానకర పరిస్థితుల్లోనే డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసిపి నుండి నిష్క్రమించారు.పైగా అజేయుడు అన్న పేరును కూడా ఆయన వైసిపి తరపున పోటీ చేసినప్పుడే పోగొట్టుకున్నారు.ఎన్టీఆర్ పెద్దల్లుడు గా డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కు అన్ని పార్టీలు మర్యాద ఇచ్చేవి.వైసిపి ఇందుకు భిన్నంగా వ్యవహరించి వెంకటేశ్వరరావుని చిన్నచూపు చూసింది.ఇదంతా దగ్గుబాటి దంపతులు మనసులో పెట్టుకుని ఉన్నారని చెబుతారు.ఈ నేపథ్యంలో పురందరేశ్వరకి జాతీయ స్థాయిలో బీజేపీలో కీలకమైన పదవి లభించడంతో ఆమె తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పటం ఖాయం.మరోవైపు వైసిపి తన రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలో మోదీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటోంది.బిజెపి అగ్రనాయకత్వానికి దగ్గర కావడానికి జగన్ మొదలు అందరూ ప్రయత్నాలు చేసుకుంటున్నారు..

ఇప్పటి వరకు వైసిపి పరిస్థితి ఢిల్లీలో బాగానే ఉంది.ఇప్పుడు పురంధ్రేశ్వరి కి ప్రాధాన్యం ఉన్న పదవి రావడంతో ఆమె వైసీపీ-బిజెపి చెలిమికి గండి కొడతారేమో నని జగన్ పార్టీ నేతలు జడుసుకుంటున్నారు.విజయసాయిరెడ్డి ఒక్కసారిగా పురందరేశ్వరి పై చేసిన వ్యాఖ్యలు చాలా గట్టిగా ఉన్నాయి పురందేశ్వరికి జాతీయ నాయకురాలిగా బీజేపీ పదవి ఇచ్చినా ఆమె ఇంకా జాతి నాయకురాలిగానే మిగిలిపోయారని ఆయన విమర్శించారు. ఇవి అభద్రతా భావం తో వైసీపీ చేస్తున్న విమర్శలు గా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.పదవి వచ్చిన మొదటి రోజే ఆమెపై విజయసాయరెడ్డి అంత స్ట్రాంగ్ గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదంటున్నారు.ఇప్పుడే సినిమా ట్రయిల్ స్టార్ట్ అయిందని అసలు సినిమా వేరేగా ఉంటుందని వారు వారు చెబుతున్నారు.