Shobha Karandlaje: కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో నిందితుడికి సంబంధించి ప్రాంతం గురించి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించడంతో పాటు క్షమాపణలు తెలియజేశారు.
ఇటీవల రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. అయితే ఈ కేఫ్ లో పేలుడుకు పాల్పడిన నిందితుడు మల్నాడు వాసి అని, అతను గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుధాలను వినియోగించడంలో ఇచ్చే శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నాడని ప్రాధమికంగా తేలిందన్నారు.
దాంతో మంత్రి శోభ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాలే కారణమని విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపై సీఎం స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో సోషల్ మీడియా వేదికగా మంత్రి శోభ క్షమాపణలు చెప్పారు.
‘నేను చేసిన వ్యాఖ్యలు ఏ ఒక్క వర్గానికి ఉద్దేశించినవి కాదని తమిళనాడు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. కృష్ణగిరి లో శిక్షణ పొందిన నిందితుడిని ఉద్దేశించే నేను మాట్లాడాను. అయితే నా మాటలు కొందరిని బాధించాయని అర్దమైంది. అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను’ అని పోస్ట్ పెట్టారు.
BJP: బీజేపీకి ఊహించని షాక్ ..కాంగ్రెస్ కండువా కప్పుకున్న కీలక నేత
To my Tamil brothers & sisters,
I wish to clarify that my words were meant to shine light, not cast shadows. Yet I see that my remarks brought pain to some – and for that, I apologize. My remarks were solely directed towards those trained in the Krishnagiri forest,
1/2— Shobha Karandlaje (Modi Ka Parivar) (@ShobhaBJP) March 19, 2024