RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ “RC16” పూజా కార్యక్రమాలు నేడు స్టార్ట్ అయ్యాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. పాన్ వరల్డ్ తరహాలో సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో వారం రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమాలో ప్రత్యేకమైన లుక్ కోసం చరణ్ వర్క్ అవుట్ లు చేయబోతున్నారట.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో వాతావరణం ఉండే తరహాలో సినిమా ఉండనుందని సమాచారం. ఈ క్రమంలో అదే మాటతీరుతో చరణ్ ఈ సినిమాలో డైలాగులు చెప్పనున్నట్లు సమాచారం. “రంగస్థలం”లో కోనసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చరణ్ అద్భుతమైన డైలాగులతో చెలరేగిపోయారు. “RC16” కోసం అదే రీతిలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన భాషతో చరణ్ డైలాగులు చెప్పబోతున్నారట. “RC16” వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ నాడు రిలీజ్ చేసే విధంగా షూటింగ్ జరపనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ నెల చివరిలో చరణ్ జన్మదినోత్సవం నాడు ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటన చేయనున్నారట.
“RC16” పూజ కార్యక్రమాలకు హీరో రామ్ చరణ్ తో పాటు దర్శకుడు బుచ్చిబాబు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వచ్చారు. అదేవిధంగా చిరంజీవి, అల్లు అరవింద్, జాహ్నవి కపూర్, డైరెక్టర్ శంకర్ రావడం జరిగింది. రామ్ చరణ్ “RRR” విడుదలయ్యి రెండు సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికే మరో సినిమా రిలీజ్ కాలేదు. మరోపక్క శంకర్ తో చేస్తున్న “గేమ్ చేంజర్” షూటింగ్స్ స్లోగా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులలో “RC16” షూట్ మొదలుకావటంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు.
Charan & Jahnvi ❣️#RC16PoojaCeremony @AlwaysRamCharan pic.twitter.com/SPxvHfyEqc
— 2ndiplcenturywhenRohit (@RohitCharan_45) March 20, 2024
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!