NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Mamitha Baiju: ప్రేమ‌లు మూవీతో భారీ క్రేజ్‌.. రెమ్యున‌రేష‌న్ ను అమాంతం పెంచేసిన మ‌మితా!!

Mamitha Baiju: కంటెంట్ బాగుంటే ఏ భాషలో అయినా ఆదరణ దక్కుతుందని ఎన్నో చిత్రాలు రుజువు చేశాయి. తాజాగా ఈ జాబితాలో ప్రేమలు చిత్రం కూడా చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ ఇది. గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్ మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మ‌ల‌యాళంలో రూ. 100 కోట్ల రేంజ్ లో వసూళ్లను సాధించింది.

ఇక ఇదే చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో మార్చి 8న‌ రిలీజ్ చేశాడు. తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ తక్కింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమితా బైజు ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రీనూ పాత్రలో ఆమె ఒదిగిపోయి నటించింది. తన అందం అభినయంతో ప్రేక్షకులనే కాకుండా విమర్శకులను సైతం మెప్పించింది. దాదాపు 15 చిత్రాల్లో నటించిన కూడా రాని క్రేజ్ ప్రేమలు మూవీ ద్వారా మ‌మితా సంపాదించుకుంది.

దీంతో సౌత్ లో ఆమెకు వ‌రుస అవ‌కాశాలు క్యూ కడుతున్నాయి. త్వరలోనే ఈ బ్యూటీ రెబల్ అనే మూవీ తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. జి.వి. ప్ర‌కాష్ కుమార్, మ‌మితా జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 22న తమిళంలో విడుదల కానుంది. అలాగే విష్ణు విశాల్ హీరోగా తెర‌కెక్క‌బోతున్న‌ ఓ చిత్రంలో మమితా హీరోయిన్ గా ఎంపిక అయింది. మరికొన్ని ప్రాజెక్ట్ లు చ‌ర్చ‌లు ద‌శలో ఉన్నాయి.

ఇక‌పోతే ప్రేమలు మూవీ ద్వారా భారీ క్రేజ్ దక్కడంతో మమితా తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసింద‌ని వార్తలు వస్తున్నాయి. ప్రేమలు చిత్రానికి గానూ రూ. 30 లక్షల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుందట. అయితే ఇకపై చేయబోయే సినిమాలకు మాత్రం మ‌మితా రూ. 50 లక్షలు డిమాండ్ చేస్తుందట. అందుకు ఒక్క రూపాయి తగ్గినా సినిమాకు సైన్ చేయనని చెబుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక వ‌రుస‌గా మరో రెండు మూడు హిట్లు పడ్డాయి అంటే మ‌మితా రెమ్యున‌రేషన్ ని రూ. కోటి క్రాస్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని సినీ ప్రియులు నెట్టింట‌ చర్చించుకుంటున్నారు.

Related posts

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri