NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: బీజేపీకి ఊహించని షాక్ ..కాంగ్రెస్ కండువా కప్పుకున్న కీలక నేత

BJP: రాజకీయాల్లో నాయకులు ఎప్పుడు ఏ పార్టీకి మారతారో ఎవరికీ తెలియదు. ఒక పార్టీ అభ్యర్ధిగా బరిలో దిగుతారు అనుకున్న నేత అకస్మాత్తుగా ప్రత్యర్ధి పార్టీలో చేసి అభ్యర్ధిగా బరిలో దిగుతుంటారు. రాజకీయాల్లో గతంలో మాదిరిగా సిద్ధాంతాలు, విలువలు ఇప్పుడు లేవు. పదవి, గెలుపే పరమావధిగా రాజకీయ పార్టీల నాయకులు చొక్కాలు మార్చినట్లుగా పార్టీలను మారుస్తుంటారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పలువురు కీలక నేతలు ప్రత్యర్ధి పార్టీల్లో చేరి అభ్యర్ధులుగా అవుతున్నారు.

నియోజకవర్గాల్లో బలమైన నేతలుగా పార్టీలు గాలం వేస్తున్నాయి. బీఆర్ఎస్ నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నేతలు ఆయా పార్టీ తరపున లోక్ సభ అభ్యర్ధులుగా బరిలో దిగుతున్నారు. సాధారణంగా నేతలు తాము ఉన్న పార్టీలో టికెట్ రాకపోతే ప్రత్యర్ధి పార్టీలో చేరడం చూస్తూనే ఉన్నాం. అయితే అభ్యర్ధిత్వం కన్ఫర్మ్ అయినా కూడా కొందరు నేతలు అకస్మాత్తుగా ప్రత్యర్ధిలోకి జంప్ అవుతుండటం ఆయా పార్టీలకు మింగుడుపడటం లేదు.

బీఆర్ఎస్ వరంగల్ లోక్ సభ అభ్యర్ధిగా బరిలో ఉంటారని భావించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. బీజేపీ నుండి ఆయన ఎన్నికల బరిలో నిలవనున్నారు. తాజాగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా నిలుస్తారు అనుకున్న కీలక నేత ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు.

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత విజయం సాధించిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో కంటోన్మెంట్ నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేష్ ను మరో సారి బీజేపీ అభ్యర్ధిగా ఆ పార్టీ దాదాపుగా నిర్ణయించింది.

కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దివంగత గద్దర్ కుమార్తె వెన్నెల మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ సారి ఉప ఎన్నకల్లో ఆమెకే టిక్కెట్ దక్కుతుందని అంతా భావించారు. అయితే గట్టి అభ్యర్ధిని నిలిపి కంటోన్మెంట్ ను తమ ఖాతాలో వేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. దీనిపై స్థానిక నేతలతో ఆయన మాట్లాడగా, ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్న బీజేపీ నేత శ్రీగణేష్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని అభ్యర్ధిగా నిలిపితే గెలుపు పక్కా అన్న సమాచారం వచ్చిందట.

దీంతో రేవంత్ రెడ్డి సూచనలతో కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, మహేందర్ రెడ్డి లు గణేష్ తో చర్చలు జరపగా టిక్కెట్ హామీ ఇస్తే వస్తానని చెప్పడంతో పార్టీ ఒకే చెప్పింది. దీంతో మంగళవారం రాత్రి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ నివాసంలో నేతలు శ్రీగణేష్ కు కాంగ్రెస్ కండువా కప్పారు. మంగళవారం మధ్యాహ్నం వరకూ మల్కాజ్ గిరిలో బీజేపీ నేత ఈటల రాజేందర్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్న శ్రీగణేష్ .. రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని శ్రీగణేశ్ పేర్కొంటున్నారు.

Vangaveeti Radha Krishna: జనసేన నేతలతో వంగవీటి రాధా కృష్ణ కీలక భేటీలు .. పార్టీ మార్పు.. పోటీ చేసే నియోజకవర్గం ఖరారు అయినట్లే(నా)..!

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju