Uppena : మెగాస్టార్ మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఆరంగేట్రం చేసిన ‘ఉప్పెన’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులే కొట్టేసింది. కరోనా వల్ల థియేటర్లు మూత పడిన తర్వాత విడుదలైన ఈ సినిమా తొలి రోజే రికార్డులు సాయి లో వసూళ్ళు సాధించింది. మొదటి రోజు 10 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే ఊపు కొనసాగింది. ప్రస్తుతం ఈ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకెళుతోంది.
ఇదే సినిమాతో హీరోయిన్ గా కృతి శెట్టి కూడా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది, ఈ సినిమాలో ఆమె నటనకు, అందానికి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అందం అభినయంతో పాటు ఆమె పర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మను దర్శకులంతా తమ సినిమాల్లో హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ గా చూస్తున్నారు.
ఈ మధ్య చిరంజీవి ‘ఉప్పెన’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా విడుదలైన తర్వాత ఆమె డేట్స్ దొరకవ్య్ అని కామెంట్ కూడా చేశాడు. ఇప్పుడు ఆమె డేట్స్ నిజంగానే బంగారం అయిపోయాయి. రెండో సినిమాకే కృతి 75 లక్షల వరకు డిమాండ్ చేసినట్లు ప్రచారం. అంతేకాకుండా ప్రస్తుతం ఆమెకు అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ లభించినట్లు సమాచారం.
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివతో మరో సినిమా ఉంది. దాని తర్వాత గౌతమ్ మీనన్ తో సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా లోనే ఆమెని హీరోయిన్ గా పరిగణిస్తున్నారట. ఇక ఈ భామ వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. 2003 లో జన్మించిన కృతి శెట్టి ఇలా ఒక సినిమా తర్వాత స్టార్ హీరో తో కనుక జతకడితే ఆమె కెరీర్ కు చిన్న వయసులోనే మంచి బూస్ట్ లభించినట్లు ఉంటుంది.