Ghani : మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటిలేస్తున్న లేటెస్ట్ మూవీ గని. బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న గని చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వాస్తవంగా అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే గని సినిమా విడుదలకు రెడీ అయ్యేది. కానీ అన్ని సినిమాల మాదిరిగా ఈ సినిమా మీద కూడా కరోనా సెకండ్ వేవ్ తో షూటింగ్ వాయిదా పడింది.
కాగా ప్రస్తుతం కరోనా కేసులు అదుపులోకి రావడంతో చిత్రబృందం షూటింగ్ రీ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం జరుపుతున్న షెడ్యూల్‌తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్ బాక్సింగ్ కి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు.
Ghani : ‘గని’ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
చిత్ర బృందం ఇచ్చిన అప్డేట్ ప్రకారం నవంబర్ 4న గని సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. మెగా హీరోలు తమ సినిమాలతో వరుసగా వస్తున్నారు. దసరాకు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ – ఎన్.టి.ఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్, క్రిస్మస్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాయి. తాజాగా వరుణ్ తేజ్ ‘గని’ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇక మిగిలింది మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆచార్య మాత్రమే. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా త్వరలో ప్రకటించనున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!