Manchu heros: మంచు ఫ్యామిలీ హీరోలందరికీ ఓ భారీ హిట్ కావాలి..దక్కేనా..?

Share

Manchu heros: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ హీరోలది ఒక ప్రత్యేకమైన స్థానం..శైలిని ఏర్పరుచుకున్నారు. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్‌గా మోహన్ బాబు ఎన్నో అఖండ విజయాలను అందుకున్నారు. అటు నిర్మాతగా, ఇటు హీరోగా మోహన్ బాబు అద్భుతమైన సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ కింగ్ అనిపించుకున్నారు. డైలాగులు చెప్పడంలో నందమూరి తారకరామారావు గారి తర్వాత ఒక్క మోహన్ బాబు వల్లే అవుతుందని ఎందరో ఆయనని ప్రశంసించారు. నిర్మాతగాను కథకు తగ్గ బడ్జెట్ పెట్టడంలో ఆ కథకి తగ్గ దర్శకుడిని ఎంచుకోవడంలో ఏ రకంగానూ కాంప్రమైజ్ కాని తత్వం మోహన్ బాబుది.

will manchu-heros-gets a great success
will manchu-heros-gets a great success

అందుకే ఆయన అంటే ఇండస్ట్రీలో చాలా మంది మరోమాట మాట్లాడకుండా చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటూ వెళుతుంటారు. సినిమా అంటే ఎంతో అంకితభావం ఉన్న మోహన్ బాబు ఏనాడు హిట్ వస్తే పొంగిపోయి, ఫ్లాప్ వస్తే కృంగిపోయిన సందర్భాలు లేవనే చెప్పాలి. గురువు గారు దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో సినిమాలు చేసిన మోహన్ బాబు..దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సూపర్ హిట్ సినిమాలు చేశారు, నిర్మించారు. పట్టుబట్టి ఎన్.టి.ఆర్ గారిని ఒప్పించి మేజర్ చంద్రకాంత్ సినిమా నిర్మించి నటించారు. ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది.

Manchu heros: మనోజ్ కాస్త కూడా కాంప్రమైజ్ కావడం లేదట.

మోహన్ బాబు నట వారసులుగా ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా సినిమాలలో రాణిస్తున్నారు. విష్ణు కెరీర్‌లో ఢీ, దూసుకెళ్తా లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అలాగే మంచు మనోజ్ కెరీర్‌లోనూ కరెంట్ తీగ, దొంగ దొంగది లాంటి మంచి హిట్ సినిమాలున్నాయి. అయితే గత మూడు నాలుగేళ్ళుగా ఈ ముగ్గురు హీరోలకి సరైన సక్సెస్ లు దక్కడం లేదు. మంచు విష్ణు గత చిత్రం మోసగాళ్ళు భారీ సక్సెస్ సాధిస్తుందనుకుంటే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడం షాకింగ్ విషయం. ప్రస్తుతం ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ మూవీ సీక్వెల్ చేస్తున్నారు.
ఇక మంచు మనోజ్ కూడా అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే పోస్టర్స్ సినిమా మీద బాగానే అంచనాలు పెంచాయి. ఈ సినిమాలోని ఓ ఫైట్‌కే మనోజ్ దాదాపు 6 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇన్నేళ్ళుగా మంచి హిట్ దక్కలేదని ఇప్పుడు అహం బ్రహ్మాసి సినిమా విషయంలో మనోజ్ కాస్త కూడా కాంప్రమైజ్ కావడం లేదట. ఎలాగైనా ఈసారి భారీ కమర్షియల్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు మనోజ్. ఇక మోహన్ బాబు కూడా సన్నాఫ్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు.

Manchu heros: చాలాకాలంగా మోహన్ బాబుకి కూడా సోలో హీరోగా హిట్ లేదు.

చాలాకాలంగా మోహన్ బాబుకి కూడా సోలో హీరోగా హిట్ లేదు. తనయులతో కలిసి నటించిన పాండవులు పాండవులు తుమ్మెద కూడా ఆడలేదు. దాంతో ఇప్పుడు మోహన్ బాబు కూడా సోలో హీరోగా సూపర్ హిట్ కొట్టేందుకు గట్టి ప్రయత్నాలలో ఉన్నారు. ఇప్పటికే సన్నాఫ్ ఇండియా టీజర్, మోహన్ బాబు ఫస్ట్ లుక్ సన్నాఫ్ ఇండియా మీద భారీగానే అంచనాలు పెంచాయి. మొత్తానికి మంచు హీరోలు ముగ్గురు భారీ హిట్ కొట్టి మళ్ళీ ఫాంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి మరి వీరికి ఎలాంటి సక్సెస్‌లు దక్కుతాయో. ఇక మంచు లక్ష్మీ కూడా కొన్ని సినిమాలలో మంచి పాత్రలను చేస్తూ, షోలకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నారు.

 


Share

Related posts

బాబు గారి తాజా వెన్నుపోటు…ఆ టీడీపీ ముఖ్య‌నేత ఎవ‌రంటే.. ?

sridhar

ఇంటరెస్టింగ్ : కొల్లు రవీంద్ర బయటకి రాగానే ఏం జరగబోతోంది ?

sridhar

బీపీ చెకప్ కి వెళ్తున్నారా? అయితే ఇలా చేయండి!!

Kumar