టాలీవుడ్ కి పూజా హెగ్డే త్వరలో టాటా చెప్పబోతుందా .. ఇది చదివాక అందరూ అదే ఫిక్సవుతారేమో ..?

టాలీవుడ్ లో పూజా హెగ్డే ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా రాధే శ్యామ్ లో హీరోయిన్ గా నటిస్తుండగా గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ పతాకాలపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతుంది. పూజా బర్త్ డే సందర్భంగా రీసెంట్ గా పూజా హెగ్డే లుక్ ని రివీల్ చేశారు.

Happy Birthday Pooja Hegde: Prabhas unveils her look from 'Radhe Shyam'; can you spot him too?

అలాగే అఖిల్ అక్కినేని సరసన కూడా పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అన్న సినిమా చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో పాటు ఎన్.టి.ఆర్ – త్రివిక్రం కాంబినేషన్ లో తెరకెక్కబోయో ఎన్.టి.ఆర్ 30 లో కూడా పూజా హెగ్డే ని హీరోయిన్ గా అనుకుంటున్నారు.

Pooja Hegde as Most Eligible Bachelor Vibha - tollywood

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలో కూడా పూజా కే హీరోయిన్ గా అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంతక ముందు హరీష్ శంకర్ తెరకెక్కించిన రెండు సినిమాలలో పూజా నే హీరోయిన్ గా నటించినది. టాలీవుడ్ లో వరసగా భారీ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా బాలీవుడ్ లో సెటిలవ్వాలని ట్రై చేస్తోంది. ఇప్పటికే ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్, అక్షయ్ కుమార్ ల సినిమాలు చేస్తోంది.

Ranveer Singh, Jacqueline Fernandez, Pooja Hegde In Rohit Shetty's Family Entertainer Next?

కాగా మరో లేటెస్ట్ బాలీవుడ్ లో పూజా హెగ్డే ఛాన్స్ దక్కించుకుందని తాజా సమాచారం. 2018లో రోహిత్ శెట్టి – రణ్వీర్ సింగ్ కాంబినేషన్ లో వచ్చిన ‘సింబా’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సర్కస్ అన్న టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ కి జంటగా పూజా హెగ్డే ని ఫైనల్ చేసుకున్నారట. ఈ ప్రాజెక్ట్ తో కలిపి పూజా తెలుగు కంటే హిందీలో ఎక్కువ సినిమాలు కమిటయింది. అందుకే ఇక పూజా బాలీవుడ్ కి పూర్తిగా మకాం మార్చబోతుందా అని మాట్లాడుకుంటున్నారు.