NewsOrbit
న్యూస్

PRC: పీఆర్సీ డ్యామేజీ కంట్రోల్ కు రంగంలోకి దిగిన వైసీపీ హైకమాండ్! వాస్తవాలు వివరించాలంటూ పార్టీ శ్రేణులకు సర్క్యులర్ జారీ!

PRC: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పీఆర్సీ ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన కారణంగా జరిగే డ్యామేజీని నివారించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రంగంలోకి వచ్చేసింది.

YCP High Command enters the field for PRC Damage Control!
YCP High Command enters the field for PRC Damage Control

పీఆర్సీ ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు విజయవంతం కావడంతో అటు జగన్ ప్రభుత్వం ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తం అయ్యింది. వెంటనే ఉద్యోగుల ఆరోపణలకు ప్రభుత్వపరంగా కౌంటర్ ఇవ్వకపోతే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే ప్రమాదముందని,తద్వారా పార్టీకి నష్టం వాటిల్లవచ్చునని అంచనా వేసిన వైసీపీ హైకమాండ్ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జులు,ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలకు ఒక సర్క్యులర్ పంపింది.ఇందులో పిఆర్సికి సంబంధించిన గణాంకాలన్నీ పొందుపర్చింది.పార్టీ నేతలంతా దీనిని ప్రతిచోటా వల్లె వేయాలని ఆదేశించింది.

ఆ సర్క్యులర్లో ఏముందంటే?

జగన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఇరవై మూడు శాతం ఫిట్ మెంట్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి నష్టం వాటిల్ల లేదన్న విషయాన్ని అందులో ప్రముఖంగా పొందుపరిచారు.ఏ ఒక్కరికీ ఒక్కపైసా కూడా జీతం తగ్గలేదంటూ కంపారిటివ్ స్టేట్మెంట్స్ కూడా అందులో చేర్చారు.స్కేల్స్ పెంచినా పెంచకపోయినా జీతం గ్రాస్ పెరిగిందా లేదా అన్నదే ముఖ్యమని దాన్నే ప్రభుత్వోద్యోగులు చూసుకోవాలని వైసీపీ కేంద్ర కార్యాలయం తన సర్క్యులర్లో పేర్కొంది.హెచ్ఆర్ఏను కూడా కేంద్ర ప్రభుత్వం ఏ ప్రామాణికంగా ఇస్తుందో దాన్నె తామూ ఆంధ్రప్రదేశ్ లో అనుసరించామని వెల్లడించింది.

PRC: వాళ్లందరికీ జీతాలు పెంచలేదా?

పనిలో పనిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇదే సర్క్యులర్లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంగన్వాడీ సిబ్బంది,శానిటరీ వర్కర్లు,సంఘమిత్రలు యానిమేటర్లు తదితర సిబ్బంది జీతాలు పెంచిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. హోంగార్డులకు డెయిలీ అలవెన్సులు పెంచడాన్ని వివరించింది.అలాగే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన విషయాన్ని గుర్తు చేసింది.ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని విధాలుగా జగన్ ప్రభుత్వం మేలు చేస్తుందన్న వాదన అంతిమంగా వినిపించింది.అంతేగాక ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని రాష్ర్టాలకంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఖర్చు ఎక్కువ అని వెల్లడించింది.ఇవే ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు వివరించి ప్రభుత్వంపైనా పార్టీపైనా అపోహలను తొలగించాలని ఆ సర్కులర్ లో పార్టీ శ్రేణులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది.

 

author avatar
Yandamuri

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju