NewsOrbit
న్యూస్

ఇక మరొక సీన్ జరగకుండా – నిమ్మగడ్డ విషయం లో జగన్ ఫైనల్ స్కెచ్ అమలు?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జగన్ పడుతున్న భయం, వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలు సత్యదూరాలు కాదనే విషయంపై ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకు కారణమయ్యింది… పార్క్ హయత్ భేటీ వ్యవహారం. ఆ భేటీ అనంతరం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. ఇవ్వాలని రూల్ లేకపోయినా.. ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందనే వాదనలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇంక నిమ్మగడ్డ వ్యవహారం నిమ్మగడ్డకే వదిలేయాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తమ విమర్శలకు, తమ అనుమానాలకు ఒక క్లారిటీ వచ్చేసిన తరుణంలో.. ఇంక ఆయన వ్యవహారం ఆయనే వదిలేసి, ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ని నియమించేసుకుని.. వీలైతే ఆయన ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వెళ్లాలని జగన్ భావిస్తున్నారంట! నిమ్మగడ్డపై ప్రజలకు క్లారిటీ రానిపక్షంలో.. ఈ దోబూచులాటలు ఇంకొంతకాలం సాగేవేమో కానీ… క్లారిటీ వచ్చేసింది, రహస్య సంబంధాలపై వాస్తవాలు వెలుగులోకి వచ్చేశాయి కాబట్టి ఇంక ఆ విషయాన్ని లైట్ తీసుకొవాలని జగన్ భావిస్తున్నారంట. అందులో భాగంగా… ఇక ఏపీకి ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డనే ఫైనల్ చేయాలని చూస్తున్నారంట.

సాధారణంగా స్థానిక ఎన్నికల విషయంలో అధికార ప్రతిపక్షాలపై నిత్యం ఆరోపణలు వస్తుంటాయి. ఎవరు అవునన్నా కాదన్నా 151స్థాయి మెజారిటీ వచ్చిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైకాపా క్లీన్ స్వీప్ చేస్తాదనే ఊహాగాణాల్లో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అదే జరిగితే.. ప్రతిపక్షాల విమర్శలకు అంతే ఉండదు. కాబట్టి ఈ సమయంలో అధికారులను, పోలీసులను తమకు అనుకూలంగా వాడుకున్నారని, ఎన్నికల సంఘం కూడా చూస్తూ ఉండిపోయిందనే విమర్శలు రాకుండా ఉండాలంటే… టీడీపీ కోరుకుంటున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని వైకాపా పెద్దలు భావిస్తున్నారంట.

ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, అధికారపార్టీ నేతలు అరాచకాలు చేశారని టీడీపీ విమర్శలు చేయలేని పరిస్థితి వస్తుందని భావిస్తున్నారంట వైకాపా నేతలు. ఎందుకంటే.. వారు కోరుకున్న వ్యక్తే ఎన్నికల అధికారిగా ఉన్నారు కాబట్టి.. ఆ విమర్శలు చేసే నైతిక హక్కు టీడీపీ కోల్పోయినట్లు అవుతుందనేది వారి ఆలోచన! దీంతో… ఆయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కుర్చోబెట్టే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుందట అధికార పార్టీ! ఇదే జరిగితే.. ఒకే దెబ్బకు రెండు పిట్టలనేది వారి ఆలోచన కాబోలు!!

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju