తిట్టుకునేంతకాదు… కొట్టుకునేంత అసంతృప్తి వైకాపాలో పబ్లిగా బయటపడింది!

Share

సంక్షేమమే ప్రథమ ప్రాధ్యాన్యంగా ఉన్నంతలో ప్రశాంతంగా సాగిపోతున్న ఏపీ ప్రభుత్వానికి పార్టీలో అసంతృప్తులతో పెద్ద తలనొప్పే వచ్చేలా ఉందనే కథనాలు మొదలైపోయాయి. ఎవరు అవునన్నా కాదన్నా వైకాపాలో ఏదో ఒక మూల అసంతృప్తి అనేది చిన్నగా మొదలైంది. వర్గపోరులో భాగమో, అధినేతపై అలకో, స్థానికంగా ఉన్న పార్టీ అంతర్గత సమస్యల కారణమో తెలియదు కానీ… అసంతృప్తి అయితే రోజుకో రకంగా బయటపడుతుంది. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకివచ్చిన ఒక సంఘటనలో అయితే ఏకంగా ఒకరిపై ఒకరు పబ్లిక్ గా దాడులు చేసుకునే పరిస్థితి నెలకొంది.

తమ వర్గానికి న్యాయం చేయడం లేదని ఒక వర్గం.. లేదు అందరికీ న్యాయం చేస్తున్నామని మరో వర్గం… ఇలా వైసీపీ నేతల అనంతరం కార్యకర్తలు కూడా బయటపడిపోతున్నారు. ఒకరి మీద ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే… రాయలసీమ జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. తమను పార్టీకి దూరం చేస్తున్నారు అని కొందరు అంటే.. తమకు పథకాలు అందడం లేదు అని మరి కొందరు అంటున్నారు. ఇవన్నీ అధికారంలో ఉన్న ప్రతీ పార్టీలో జరిగే రెగ్యులర్ తంతే అయినప్పటికీ… వీటిని మొగ్గలోనే తుంచేయని పక్షంలో.. చినికి చినికి గాలివానగా మారే ప్రమాధం అయితే లేకపోలేదు.

మొన్న అనంతపురంలో వైకాపా కార్యకర్తల మధ్య రగడ జరగగా… తాజాగా చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం రామాపురం తండాలో వైసీపీలోని ఇరు వర్గాల మధ్య మరింత బలమైన వర్గపోరు బయటపడింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రామాపురం తండాలో ఉపాధి హామీ పనుల విషయంలో మాకు అన్యాయం జరుగుతుందని మెల్లగా మొదలైన ఈ గొడవ.. భూతిక దాడులిఉ చేసుకునేవరకూ వచ్చింది. ఈ ఘర్షణలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేష్ నాయక్ ప్రాణాలు కోల్పోయారు.


Share

Related posts

Narasimhaswamy: ఆ నరసింహస్వామి విగ్రహాన్ని తాకితే… మనిషిని తాకినట్టు ఉంటుంది…ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే వింతలు ఎన్నెన్నో!!  

siddhu

సీఎం సీన్ తగ్గిందా ?’రాజు’ గారి రేంజ్ పెరిగిందా..??

Yandamuri

బిగ్ బాస్ 4 అప్డేట్ : ఆమె ను మాత్రం వద్దనే వద్దు అనేశారు…?

arun kanna