NewsOrbit
న్యూస్

YSRCP: జగన్ అది పెద్ద నిర్ణయం..? 30 మంది ఎమ్మెల్యేల్లో గుబులు..!!

AP Employees JAC to meet cm jagan tomorrow

YSRCP: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్న సంవత్సరాలు దాటింది. ఇప్పుడిప్పుడే వైసీపీలో కుమ్ములాటలు ఆరంభం అయ్యాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ పలువురు  అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనబడుతోంది. ఓ పక్క ప్రజల్లో వ్యతిరేకత, మరో పక్క కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు  వ్యతిరేకవర్గాలు తయారు అవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే జరిపిస్తున్నారని వార్తలు కూడా సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. సొంత పార్టీలో వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో అభ్యర్ధులను మార్చాక తప్పదనే సంకేతాలు కూడా పార్టీ అధిష్టానం నుండి చూచాయగా సూచనలు అందుతున్నట్లు సమాచారం.

YSRCP Internal politics
YSRCP Internal politics

YSRCP: ప్రాధాన్యత ఇవ్వడం లేదని..?

రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో సుమారు 30 నుండి 40 నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లపై ఆ పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు వినబడుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేసిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేలకు దగ్గర అయిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనీ, తొలి నుండి పార్టీలో ఉన్న వారిని విస్మరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో పక్క సొంత పార్టీకి చెందిన ఎంపీలతో సఖ్యతగా ఉన్న నేతలను పలువురు ఎమ్మెల్యేలు పక్కన పెట్టి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న మాట కూడా వినబడుతోంది. ఉదాహరణకు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. ఆమెకు సొంత పార్టీ నుండే అసమ్మతి కనబడుతోంది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ వర్గాలుగా వైసీపీ శ్రేణులు విడిపోయి ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో శ్రీదేవికి టికెట్ కన్ఫర్మ్ చేస్తే సురేష్, మాణిక్యవరప్రసాద్ వర్గం సహకరించదనేది బహిరంగ రహస్యం.

 

30 నియోజకవర్గాల్లో నేతలకు

అదే విధంగా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పరిస్థితి ఇటీవల బహిర్గతం అయ్యింది. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ ఇటీవల ఆమె బహిరంగంగా వ్యాఖ్యానించారు. తనపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇలా దాదాపు 30 నియోజకవర్గాల్లో పార్టీ అంతర్గత విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గాల్లో సర్వే ఆధారంగా వాళ్లకు టికెట్ ఇవ్వకుండా తప్పించడం గానీ, లేక వారిలో కొందరిని వేరే నియోజకవర్గానికి పంపడం గానీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి వీరంతా తమపై ఉన్న అసమ్మతిని పొగొట్టుకుంటారో లేక సీటు ఖాళీ చేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంటారో చూడాలి మరి.

Read More: BREAKING: ” నేను ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ పెడితే తప్పేంటి ” రిపోర్టర్ కి వై ఎస్ షర్మిల అద్భుత సమాధానం !

author avatar
sharma somaraju Content Editor

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju