NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అమరావతి టూ విశాఖ వయా ఢిల్లీ.. ఆ కధ ఏమిటో మీరే చదవండి.. !!

YS Jagan: Big Plan to Shift Capital

రాజధాని మూడు ముక్కలయింది. వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొంది మూడు రోజులు అయ్యింది. విశాఖ రాజధానికి ముహూర్తం కుదిరింది అనుకున్న సమయంలో హైకోర్టు మొట్టికాయ వేసింది. స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. జగన్ కు, వైసీపీ బృందానికి ఆనందం ఆవిరి చేసింది. టిడిపిలో ఆశ నింపింది. అమరావతి రైతులకు ఊపిరిపోసింది. ఇంత అనూహ్యంగా నిర్ణయాన్ని ఎవరూ ఊహించలేదు. అమరావతి రాజధాని అంశంపై ఇంత త్వరగా హైకోర్టు.. స్టేటస్ కో ఇస్తుందని, కనీసం పిటిషన్ వేసిన వారు కూడా ఊహించి ఉండరు. అయితే కోర్టులో కోర్టుకి పాయింట్ లే కీలకం. వేసిన పిటిషన్ లో పాయింట్ ఉంటే ఆ పాయింట్ కి అనుగుణంగా తీర్పును, స్టే ఇస్తుంది. దానికి ప్రతి వాదనలు చేసుకొని కౌంటర్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇప్పుడు ప్రభుత్వం పై ఆ కీలక బాధ్యత పడింది. ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టి రాజకీయం మాట్లాడుకోవాలంటే…

Amaravathi to visakha via delhi

ఢిల్లీ పెద్దలు చూస్తున్నారా..? లేదా..?

ఏపీలో బీజేపీ లేదు. నాయకులు మాత్రమే ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో కమలం గుర్తుకు చెప్పుకోదగ్గ ఓట్లు ఉండవు. ఎన్నికల ఫలితాలలో ఆ పార్టీ నాయకులకు సీట్లు ఉండవు. కానీ ఢిల్లీలో పీఠం పుణ్యమా అని ఏపీలో రాజకీయ చక్రాన్ని అధికారి చక్రాన్ని తిప్పే స్థాయిలో బిజెపి ఉంది. అందుకే ఎన్నికల కమిషనర్ విషయంలో అయినా రాజధాని విషయంలో అయినా మండలి రద్దు విషయంలో అయినా ఇలా రాష్ట్రంలోని ఎటువంటి కీలక నిర్ణయంలో అయినా బిజెపి పాత్ర కీలకంగానే మారుతుంది. కానీ ఇక్కడ బిజెపి ఏది నేరుగా చెప్పదు. బిజెపి నాయకులు గానీ నేరుగా చెప్పరు. స్పష్టత ఇవ్వరు. ఆ పార్టీలో ఉన్న రకరకాల సామాజిక వర్గాల నాయకులు రాక రకాలుగా మాట్లాడుకుంటారు. ఏది అధికారిక వాదన ఉండదు. కానీ బీజేపీ చేతిలో ఉన్న వ్యవస్థలతో బిజెపి అభిప్రాయం ఏమిటి అనేది పరోక్షంగా బయటకు వస్తుంది. రాజకీయంగా ఆ పార్టీకి నిర్ణయం తీసుకునే శక్తి లేకపోయినా అధికారికంగా కేంద్రీకృతమైన పగ్గాల ద్వారా రాష్ట్రంలోని కీలకమైన విషయాలతో ఆటలు ఆడుకుంటుంది.

* ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలోనే ఉదాహరణగా చూసుకుందాం. ఈ వ్యవహారంలో ఎన్నికల కమిషనర్ ను తప్పించింది వైసీపీ ప్రభుత్వం. కమిషనర్ తరపున పోరాడాల్సింది టిడిపి. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ పై విమర్శలు చేస్తూ జగన్ ఆయన టిడిపి కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సో.. ఇక్కడ ఫైట్, పోరాటం వైసీపీ – టీడీపీ మధ్య. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగా కోర్టులో పిటిషన్ వేసింది ఎవరు.. కామినేని శ్రీనివాస్. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు పార్క్ హయత్ లో కలిసింది ఎవరు.. కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి. వీళ్ళు బీజేపీకి చెందిన వాళ్లే. అంటే బిజెపి ముద్ర, బిజెపి నీడ లేకుండానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం తేలిందా..? సరే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం.

* అమరావతి రాజధాని అంశాన్నే చూసుకుందాం. అమరావతి నుండి రాజధాని ని తరలించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యతిరేకించారు. బిజెపికి అనుబంధంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ కొంత మంది నాయకులు మాత్రం కేంద్రం పరిధిలో అంశం కాదు రాష్ట్ర పరిధిలోని అంశం అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఈ నిర్ణయాలన్ని పక్కకు వెళ్లి మూడు రాజధానులు అంటే పాలనా వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ చేతికి వచ్చినప్పుడు గవర్నర్ సంతకం పెట్టకుండా పది రోజులు తన దగ్గరే పెట్టుకున్నప్పుడు ఈ మధ్యలో బిజెపి కొన్ని వ్యవహారాలు చక్కబెట్టింది. మూడు నెలలుగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అధ్యక్షుడు మార్పును ఆగమేఘాల మీద తేల్చేసింది. రాజధాని అమరావతికి అనుకూలంగా మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ ను తప్పించి టీడీపీకి వ్యతిరేకంగా ఉంటూ, వైసిపికి కాస్త చూసి చూడకుండా వ్యవహరించే సోము వీర్రాజును తీసుకొచ్చి అధ్యక్షుడిగా మార్చింది. ఇది జరిగిన రెండు రోజుల్లోనే గవర్నర్ మూడు రాజధానుల బిల్లును ఆమోదించారు. అంటే బీజేపీ ఆదేశాలు లేకుండానే గవర్నర్ బిల్లు ఆమోదించేరా లేదా అనే చర్చ ఇక్కడ అనవసరం. అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్నంత.

* అమరావతి రాజధానిగా ఉండాలి, పాలన వికేంద్రీకరణ వద్దు అంటూ కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. కోర్టు వాటిని పరిశీలించి విచారణకు స్వీకరించి పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశించింది. ఆదేశిస్తూనే.. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టేటస్ కో ఇచ్చింది. అంటే గవర్నర్ ఆమోదించిన బిల్లులపై యధాతథ స్థితిలో ఉంచేలా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో శాసన వ్యవస్థ, పాలనా వ్యవస్థ పై న్యాయవ్యవస్థ పెత్తనం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర స్థాయిలో అన్ని వ్యవస్థ లను బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం మేనేజ్ చేసే స్థాయిలో ఉందా లేదా అనేది కొంత మేరకు చర్చ జరుగుతోంది. దీనిలో న్యాయ వ్యవస్థను పక్కన పెట్టాలి. పెట్టాల్సిందే. న్యాయవ్యవస్థ వీటి దేనికి సంబంధం లేకుండా సమాంతరంగా పని చేస్తుంది. అయితే ఇతర వ్యవస్థలపై బీజేపీ ముద్ర ఎంతో కొంత ఉంటుందని విమర్శలు, ఆరోపణలు మాత్రం వస్తుంటాయి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju