NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ కొత్త వ్యూహం.. !

రాష్ట్రాలలో పార్టీ ల బలాబలాలతో సంబంధం లేకుండా అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచించి అమలు చేయడం భారతీయ జనతా పార్టీ (బీజేపీ )కి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇటువంటి వ్యూహాలు ఉత్తరాది రాష్ట్రాలలో క్లిక్ అవుతాయి కానీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో అంతగా పారవు. ఈ విషయాన్ని గమనించే బీజేపీ..2024 ఎన్నికల నాటికి ఏపిలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సరికొత్త వ్యూహంతో పావులు కదిపేందుకు సన్నాహాలు ప్రారంభించింది అని అంటున్నారు పరిశీలకులు. పశ్చిమ బెంగాల్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగినా, త్రిపురలో అధికారాన్ని బీజేపీ హస్తగతం చేసుకున్నా ఆయా రాష్ట్రాల్లో సీపీఎం బలహీన పడటం వల్లనే సాధ్యం అయ్యింది.

ప్రస్తుతం ఏపి విషయాన్నే తీసుకుంటే 151 స్థానాలతో సిఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో టీడీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా డీలా పడిపోయింది. టీడీపీకి గ్రామ స్థాయి నుండి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో నాయకులు బయటకు వచ్చే సాహసం చేయడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీని మరింత బలహీన పరిస్తే బీజేపీ రెండవ స్థానానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇటీవల వరకు బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడుతూ పరోక్షంగా టీడీపీకి కాపు కాస్తున్నారనే విమర్శలు మోశారు. వైసీపీలోకి వెళ్లలేక, టీడీపీలో కొనసాగలేక సైలెంట్ గా ఉన్న టీడీపీ నేతలను సైతం బీజేపీలోకి తీసుకుని రావడంలో కన్నా దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో మొదటి నుండి టీడీపీని వ్యతిరేకించే సోము వీర్రాజు అయితే ఈ వర్గానికి చెక్ పెడతారని రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయగలుగుతారని భావించి పార్టీ పగ్గాలు అప్పగించారని అనుకుంటున్నారు. గతంలో టీడీపీ నుండి బీజేపీకి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరిగింది. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి తరువాత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తదితరులు బీజేపీలో చేరిన తరుణంలో ఇంకా చాలా మంది వచ్చే వారు ఉన్నారని, మాజీ మంత్రులు జేసీ దివాకర్ రెడ్డి, గంట శ్రీనివాసరావు తదితరులు కూడా బీజేపీవైపుకు చూస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఒక్క సారిగా పరిస్థితి స్తబ్దుగా మారడంతో టీడీపీ నుండి అధికార వైసీపీకి వలసలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీని బలహీన పర్చకుంటే బీజేపీ బలపడే పరిస్థితి లేదు. కన్నా కొనసాగితే అది సాధ్యం కాదని పార్టీ అధిష్టానం దృష్టి కి వెళ్ళిపోయింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టై అప్ తో రాష్ట్రంలో బీజేపీ ప్రధాన భూమిక పోషించేందుకు అడుగులు వేస్తున్నది. సోము వీర్రాజు అధికార వైసీపీపై కాస్త సాఫ్ట్ కార్నర్ గా ఉన్నప్పటికీ పార్టీ ఆదేశాల మేరకే పని చేస్తారని నమ్మకం ఉంది అంటున్నారు. ముందుగా టీడీపీ క్యాడర్ ను లాగి బీజేపీని బలోపేతం చేస్తే ఎన్నికల నాటికి వైసీపీలోని అసంతృప్తివాదులు వచ్చి చేరతారని తద్వారా వైసీపీ, బీజేపీ- జనసేనకూటమి మధ్యనే ప్రధాన పోటీ జరుగుతుందని వారి అభిప్రాయంగా ఉన్నట్లు సమాచారం.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?