NewsOrbit
బిగ్ స్టోరీ

హిందువులకో న్యాయం… ముస్లింలకు మరో న్యాయమా…?

మతం ప్రాతిపదిక నిర్ణయాలు తీసుకుంటారా…పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై దనీశ్ కనేరియా ధ్వజం..!

 

నేను హిందువును… హిందువుగానే బతుకుతాను… మీరేం చేసుకున్నా సరే… నాకు అభ్యంతరం లేదు. హిందూ ధర్మాన్నే ఆచరిస్తాను. ధర్మం ప్రకారం నడుచుకుంటాను. జీరో టాలరెన్స్ కేవలం ఒక్క నా మీద మాత్రమేనా… ఇది ఇతరులకు వర్తించదా… మీ కక్షలకు మతం, రంగు, వ్యక్తిగత పలుకుబడే ప్రాతిపదికా… నేను హిందువును. అందుకు గర్విస్తున్నాను. అదే నా బ్యౌగ్రాండ్… నా ధర్మం కూడా అదే… అవును ఈ మాటలు మనదేశంలో ఎవరైనా ఒక మైనార్టీ సెలబ్రెటీ మాట్లాడితే అది దేశంలోనే పతాక శీర్షిక వార్త. కానీ ఈ వ్యాఖ్యలు చేసింది వేరెవరో కాదు… పాకిస్తాన్ క్రికెట్ స్పిన్ కు సరికొత్త సొబగులు దిద్దిన ఏక్ స్పిన్నర్ దనీశ్ కనేరియా….

బతకడం కష్టంగా మారింది… !పాకిస్తాన్ బోర్డు తీరుపై విరుచుకుపడ్డారు ఆ దేశ దిగ్గజ స్పిన్నర్ దనీశ్ కనేరియా… క్రికెట్ ఆటను భ్రష్టుపట్టించిన ప్రపంచదేశాల్లో నెంబర్ 1 వరుసలో ఉండే పాకిస్తాన్…కనేరియాపై వివక్ష చూపుతోంది. కేవలం హిందువు అన్న కారణంతో అతని పట్ల అనుచిత వైఖరితో నరకయాతన గురిచేస్తోంది. పాకిస్తాన్‎లో ఉన్న క్రికెటర్లందిరికీ ఒక న్యాయం… నాకో న్యాయమా అంటూ కనేరియా చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో చర్చనీయాంశంగా మారుతోంది. ఒక్క కనేరియాపైనే వేటు వేసి అక్కడి బోర్డు పెద్దలు క్రికెట్ ను అపహాస్యం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నాడు. క్రికెట్ ఆడలేకపోవడం వల్ల జీవనోపాధికి సైతం ఇబ్బందులెదుర్కొంటున్నట్టు చెప్పాడు.

ఒక్కొక్కరికీ ఒక్కోలా న్యాయమా…?మ్యాచ్ ఫిక్సర్లకు పెట్టిందిపేరుగా ఉండే పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అక్కడి బోర్డ్ ఎలా సపోర్ట్ చేస్తుందో అందరికీ తెలిసిందే… తనది సలీమ్ మాలిక్ లాంటి వాళ్ల కేసు కాదని.. మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ తో తన కేసుకు సంబంధం లేదన్నారు కనేరియా… 2012లో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆట సందర్భంగా ఫిక్సింగ్ కు పాల్పడ్డాడన్న విమర్శలున్నాయ్. అయితే అవి నిజం కాదని అందుకు ఎలాంటి ఆధారాలు లేవని కనేరియా చెప్పుకొచ్చాడు. ఉమర్ అక్మల్ పై మూడేళ్ల నిషేధాన్ని 18 ఏళ్లకు కుదించడంపై కనేరియా స్పందించాడు. ఇది కేవలం కొందరికే ఎందుకు? మతం ఆధారంగా ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించాడు… ఐసీసీ నిబంధనల మేరకు తనపై నిషేధం ఎత్తివేస్తే… జాతీయవాళీ ఆటల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని కనేరియా పీసీబీని చాన్నాళ్లుగా కోరుతున్నాడు.

పాకిస్తాన్‎కే జీవితం అంకితం.తను పుట్టి పెరిగిన పాకిస్తాన్ కు నాయకత్వం వహించడం తన అదృష్టమని… పాకిస్తాన్ పౌరుడిగా ఎప్పటికీ గర్విస్తానంటాడు కనేరియా. తనకు ఇంకా క్రికెట్ ఆడాలని ఉందని… క్రికెట్ తనకు బతుకుదెరవంటాడు కనేరియా. 19 ఏళ్లకే టెస్ట్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన కనేరియా 61 టెస్టుల్లో 261 వికెట్లను పడగొట్టాడు. పాకిస్తాన్ కు టెస్టుల్లో అత్యంత పకడ్బందీ బౌలింగ్ చేసే ఆటగాళ్లలో కనేరియా ఒకడు. ఇక కరోనా విజృంభణ సమయంలో దేశంలోని మైనార్టీ వర్గాలకు అండగా నిలిచి… గొప్ప మనసు చాటుకున్నాడు. మొత్తంగా పాకిస్తాన్ మేడిపండు చందం వ్యవహారం మరోసారి కనేరియా రూపంలో ప్రపంచానికి తెలుస్తోంది.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju