బాబుకు కొత్త బెంగ! కమ్మ వారే కొత్త నాయకుడిని వెతుక్కుంటున్నారంట!!

ఆంధ్రప్రదేశ్లోని కమ్మ సామాజిక వర్గీయులకు ఇప్పుడు కొత్త దిగులు పట్టుకుంది.ఎన్టీఆర్ కాలం నుండి టిడిపిని నెత్తిన పెట్టుకుని కమ్మవారు మోస్తున్నారు.ఇక చంద్రబాబు నాయుడు అవసరాలను వారు తీర్చారు.వారికి కావలసినవన్నీ చంద్రబాబు చేసి పెట్టారు.2004 నుండి 2014 వరకు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ మనుగడ సాగించగలిగ౦దంటే కమ్మ బడా నేతల ఆర్థిక అండదండలే కారణం.ఇక టిడిపి అధికారంలో ఉన్న 2014- 2019 సంవత్సరాల మధ్య రాష్ట్రంలో కమ్మవారి పంట పండింది.వారి రుణాన్ని చంద్రబాబు అన్ని రకాలుగా తీర్చుకున్నారు.ఎంత వీలైతే అంత వారికి బాబు దోచి పెట్టారని టాక్ ఉంది.అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో టిడిపి కంటే కూడా కమ్మ వారి పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.

chandra babu is searching for new kamma leader
chandra babu is searching for new kamma leader

టీడీపీ అధికారం కోల్పోవడం అటుంచి వైసిపి ప్రభుత్వం కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తున్న సూచనలు గోచరించాయి.దీంతో తెలుగు కమ్మలు తెగ వర్రీ అయిపోతున్నారు.ఇప్పటికీ వారు తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకునే ఆలోచనలో లేరుగానీ..ఆ పార్టీని సమర్థంగా నడిపించే నాయకుడు కోసం ఎదురుచూస్తున్నారు.చంద్రబాబు ఉన్నంత వరకు ఢోకా లేదు గానీ ఆ తర్వాత టిడిపిని అంత సమర్థంగా నడిపేవారుగానీ ,కమ్మ ప్రయోజనాలను కాపాడేవారు గానీ ఎవరుంటారా అన్నది వారికి పెద్ద ఆలోచన గా మారింది.చంద్రబాబుకు వయసు మీద పడడం ఆందోళన కలిగిస్తోంది.ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.చంద్రబాబు కుమారుడు లోకేశ్ శక్తిసామర్థ్యాలపైనే కమ్మసామాజిక వర్గీయులకే నమ్మకం కుదరడం లేదు.మళ్ళీ నందమూరి కుటుంబీకులైన బాలకృష్ణ గానీ జూనియర్ ఎన్టీఆర్ గానీ పార్టీ పగ్గాలు చేపడితే కొద్దిగా ప్రయోజనం ఉంటుందని వారు భావిస్తున్నారట.

chandra babu is searching for new kamma leader
chandra babu is searching for new kamma leader

వాస్తవానికి టీడీపీలో కమ్మ నాయకులే బడా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు. ఈ లాబీ ఎంత బలంగా ఉంటుందో చంద్రబాబుకు కూడా తెలుసు.ఈ కమ్మ బ్యాచ్ ఇప్పుడు టిడిపి నాయకత్వం మార్పును కోరుకుంటుండడం చంద్రబాబుకి కూడా లోలోన ఆందోళన కలిగిస్తోందట.ఎంత ఖర్చు అయినా పర్వాలేదు తమ భవిష్యత్తుకు ఢోకా లేని విధంగా కొత్త నాయకుడు ఉంటే చాలని ఆ వర్గం కోరుకుంటోంది. కమ్మల్లోంచి కొత్త నాయకుడు పుట్టుకొస్తే ఆయనకు బ్రహ్మరథం పట్టడాన్ని ఆ సామాజిక వర్గీయులు సిద్ధంగా ఉన్నారు.అయితే అలాంటి కమ్మ బాహుబలి ఎవరన్నదే ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న ప్రశ్న!